Russia-Ukraine War: రెండేళ్లుగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం సాగుతూనే ఉంది. బలమైన రష్యా ముందు ఉక్రెయిన్ కొన్ని వారాల్లోనే ఓడిపోతుందనే అంచనాల నేపథ్యంలో అమెరికా, వెస్ట్రన్ దేశాలు ఇచ్చే ఆర్థిక, సైనిక సాయంతో రెండేళ్లుగా ఉక్రెయిన్, రష్యాను నిలువరిస్తోంది. పటిష్టమైన రష్యా సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. ఇదిలా ఉంటే, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా నుంచి మరణించే సైనికుల సంఖ్య భారీగా ఉంటోంది. ఇప్పటి వరకు 50,000 మంది రష్యన్ సైనికులు మరణించినట్లు బీబీసీ, మీడియాజోనా నివేదించింది.
Read Also: TMC manifesto: సీఏఏ, ఎన్‌ఆర్సీ రద్దుతో పాటు 10 వాగ్దానాలు.. ఏవేవంటే..!
యుద్ధం రెండో ఏడాదిలో 27,300 కంటే ఎక్కువ మంది రష్యన్ సైనికులు మరణించారని చెప్పారు. ఇది మొదటి సంవత్సరం కన్నా ఎక్కువ. BBC రష్యన్, మీడియాజోనా మరియు వాలంటీర్లు ఫిబ్రవరి 2022 నుండి ఈ మరణాలను లెక్కిస్తున్నారు. మరణాల లెక్కను తేల్చడానికి అలాగే కొత్త సమాధుల సంఖ్యను అంచనా వేయడానికి రష్యన్ శ్మశానవాటికలకు సంబంధించి శాటిలైట్ చిత్రాలను ఉపయోగిస్తున్నారు. ఈ యుద్ధంలో 50,000 మంది రష్యా సైనికులు మరణించారని నివేదిక తెలుపుతోంది. అయితే ఇది సెప్టెంబర్ 2022లో రష్యా అందించిన అధికార మరణాల సంఖ్య 8 రెట్లు ఎక్కువ. ఈ లెక్కల్లో ఉక్రెయిన్ లోని డోనెట్స్స్, లూగాన్స్క్ మిలీషియా మరణాలు లేవు.
ఉక్రెయిన్ ఫిబ్రవరిలో 31,000 మంది సైనికులను కోల్పోయిందని, అయితే ఈ సంఖ్య నిజమైన మరణాల కన్నా తక్కువగా ఉండే అవకాశం ఉందని నివేదికలు పేర్కొన్నాయి. జనవరి 2023లో రష్యా డోనెట్స్క్ దాడిలో, బఖ్‌ముత్ దాడిలో ఎక్కువ మంది సైనికులను కోల్పోయింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫిబ్రవరి 24, 2022న ఉక్రెయిన్‌పై‘ ప్రత్యేక సైనిక చర్య’ని ప్రకటించారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య రక్తపాతం చోటు చేసుకుంటోంది.
