కోవిడ్ కేసులతో యూరప్ వణికిపోతుంది. గత వారం వ్యవధిలో దాదా పు 20 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వ్యాప్తి మొదలు ఒకే వారంలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్‌ఓ) ఆందోళన వ్యక్తం చే సింది. ఇదే వ్యవధిలో దాదాపు 27 వేల మరణాలు సంభవించినట్టు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని మరణాలను లెక్కగడితే.. సగానికి పైగా ఇక్కడే నమోదైనట్టు పేర్కొంది. యూరప్‌లోని తాజా పరిస్థితులపై డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ ట్రెడోస్ అధానోమ్ కూడా స్పందించా రు. జెనీవాలో ఆయన మాట్లాడుతూ.. పశ్చిమ ఐరోపాలో వ్యాక్సి నేషన్ రేటు అధికంగా ఉన్న ఫ్రాన్స్, బెల్జియం తదితర దేశాల్లోనూ కేసులు పెరుగుతున్నాయన్నారు. ఇది మరొక హెచ్చరిక అని ఆయన తెలిపారు.
కేవలం టీకాలతోనే కోవిడ్ కట్టడి సాధ్యం కాదని ట్రెడోస్ గుర్తు చేశా రు.పెద్ద ఎత్తున కరోనా పరీక్షల నిర్వహణ, మాస్కుల వినియోగం, భౌతిక దూరం, మెరుగైన వెంటిలేషన్ తదితర చర్యలను ఆపకుండా నిరంతరం కొనసాగించాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులు, వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉన్నవారు ఇంకా తొలి డోసు టీకా కోసం ఎదురు చూస్తునే ఉన్నారని, వారిని వదిలిపెట్టి ఆరోగ్యంగా ఉన్నవారికి బూస్టర్ డోస్‌లు, పిల్లలకు టీకాలు వేయడంలో అర్థం లేదని ట్రెడోస్ తెలిపారు.
