NTV Telugu Site icon

Donald Trump: ట్రంప్ అరెస్ట్, విడుదల.. అమెరికాను నాశనం చేస్తున్నారంటూ ఆగ్రహం..

Donald Trump

Donald Trump

Donald Trump: అమెరికాలో ఎప్పుడూ జరగని విధంగా ఓ మాజీ అధ్యక్షుడు అరెస్ట్ అయ్యారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్‌తో సంబంధాన్ని దాచిపెట్టి ఉంచేందుకు ఆర్థికంగా ప్రలోభపెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ హుష్ మనీ కేసులో పోలీసులు ట్రంపును అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం న్యూయార్క్ లో ని మాన్ హటన్ లోని కోర్టులో హాజరయ్యారు ట్రంప్. ఆయనపై మొత్తం 34 అభియోగాలను నమోదు అయ్యాయి. అయితే తాను దోషిని కానని ట్రంప్ కోర్టు ముందు తెలిపారు.

ట్రంప్ లొంగిపోయే ముందుకు తన మద్దతుదారులతో భారీ ర్యాలీలో కోర్టుకు వచ్చారు. అక్కడ ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి అటార్నీ కార్యాలయానికి తరలించారు. ఫింగర్ ఫ్రింట్స్, ఫోటోలు తీసుకున్నారు. విచారణ అనంతర కోర్టు నుంచి ఆయన వెళ్లిపోయారు. ట్రంప్ అరెస్ట్ నేపథ్యంలో న్యూయార్క్ లో హై అలర్ట్ ప్రకటించారు. కోర్టు వద్ద భారీగా భద్రతాబలగాలను మోహరించారు.

Read Also: Pakistan Economic Crisis: భారీగా పాకిస్థాన్ రూపాయి పతనం.. డాలర్‌తో విలువ ఎంతంటే..

ఇదిలా ఉంటే ట్రంప్, జో బైడెన్ పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మార్కిస్ట్ సిద్ధాంతాన్ని అనుసరించే తృతీయ ప్రపంచ దేశంగా అమెరికా మారుతోందని ఆరోపించారు. ఎలాంటి నేరం చేయలేకపోయినా నన్ను అరెస్ట్ చేసేందుకు అధికార పార్టీ కుట్ర చేసిందని అన్నారు.

కోర్టు నుంచి వెళ్లిన తర్వాత ఫ్లోరిడాలోని తన నివాసం మార్-ఏ-లాగో నుంచి తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. మనదేశం నాశనం అవుతోందని, నరకానికి వెళ్తోందని అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచం మనల్ని చూసి నవ్వుతోందని అన్నారు. అమెరికాలో ఇలాంటివి జరుగుతాయని నేను ఎప్పుడూ అనుకోలేదని, నేను చేసిన నేరం ఏంటంటే దేశాన్ని నాశనం చేయాలనుకునేవారి నుంచి రక్షించేందుకు ప్రయత్నించడమే అని ట్రంప్ అన్నారు. ఇది దేశాని అవమానం అని అన్నారు.