Oscar Awards: ఆస్కార్ వేడుకలో నటుడు ‘యుద్ధం’ ప్రస్తావన.. ప్రియాంక చోప్రా రియాక్షన్ వైరల్

  • ఆస్కార్ వేడుకలో నటుడు ‘యుద్ధం’ ప్రస్తావన
  • ప్రియాంక చోప్రా రియాక్షన్ వైరల్
  • సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో
Priyanka1

Priyanka1

లాస్‌ ఏంజెలెస్‌లో అట్టహాసంగా 98వ ఆస్కార్ అవార్డుల వేడుక జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ కళాకారులంతా సందడి చేశారు. అయితే ఈసారి అవార్డుల కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్పానిష్ నటుడు జేవియర్ బార్డెమ్ ఆస్కార్ వేదికపై ఆశ్చర్యకమైన ప్రకటన చేశాడు. బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా పక్కన ఉన్నప్పుడు కీలక సందేశం ఇచ్చాడు. నటుడు సంచలన ప్రకటన చేయగానే.. ప్రియాంక చోప్రా ఇంట్రెస్టింగ్ రియాక్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Sonia Gandhi vs Deve Gowda: సోనియాగాంధీకి మాజీ ప్రధాని లేఖ.. హాట్ టాపిక్‌గా అంశాలు

ఆస్కార్ వేదికపై నటుడు జేవియర్ బార్డెమ్ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగాన్ని ప్రకటిస్తూ.. ‘‘యుద్ధం వద్దు.. పాలస్తీనాను విడిపించండి!’’ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అతని జాకెట్‌పై కూడా ‘‘నో ఎ లా గెరా’’ (యుద్ధం వద్దు) అని రాసి ఉంది. పక్కనే ఉన్న ప్రియాంక చోప్రా నవ్వుతూ సానుకూల సంకేతాన్ని వ్యక్తం చేసింది.

ఇది కూడా చదవండి: Rajya Sabha: రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. బీజేపీ అభ్యర్థికి ఓటేసిన కాంగ్రెస్ ముస్లిం ఎమ్మెల్యే.. ఎక్కడంటే..!

ఇటీవలే గాజా-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది. ప్రస్తుతం అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నటుడు ఈ బ్యాడ్జ్ ధరించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది నటుడు ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. మరికొందరు విమర్శించారు. ఒక యూజర్ ‘‘జేవియర్ బార్డెమ్ ధైర్యానికి సెల్యూట్, ఫ్రీ పాలస్తీనా!’’ అని రాశారు, మరొకరు ‘‘ఆయన నటించాలి.. రాజకీయాలకు దూరంగా ఉండాలి.’’ అని రాసుకొచ్చారు.