Site icon NTV Telugu

Balochistan: “ఆపరేషన్ బామ్‌”తో పాకిస్తాన్‌కి దడ పుట్టిస్తున్న బలూచ్ వీరులు..

Blf

Blf

Balochistan: పాకిస్తాన్‌ను బలూచ్ లిబరేషన్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) వణికిస్తోంది. కొత్తగా ‘‘ఆపరేషన్ బామ్’’ చేపట్టింది. దీంతో పాక్ సైన్యం, భద్రతా బలగాలు వణికిపోతున్నాయి. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్‌కు విముక్తి కల్పించేందుకు బీఎల్ఎఫ్ పోరాడుతోంది. బుధవారం బలూచిస్తాన్‌లోని టర్బాట్‌లో జరిగిన గ్రెనేడ్ దాడిలో మహిళలు, పిల్లలు సహా కనీసం ఐదుగురు గాయపడ్డారు. దక్షిణ బలూచిస్తాన్‌లోని కెచ్ జిల్లాలో భాగమైన టర్బాట్‌లోని అబ్సర్ ప్రాంతంలోని ముహమ్మద్ యూనిస్ నివాసంపై మోటార్ సైకిళ్లపై వచ్చిన గుర్తు తెలియని దుండగులు హ్యాండ్ గ్రెనేడ్ విసిరారు.

మంగళవారం రాత్రి నుంచి బలూచిస్తాన్ అంతటా బీఎల్ఎఫ్ ‘‘ఆపరేషన్ బామ్’’ని ప్రారంభిస్తుంది. దీని అర్థం ‘‘తొలి వెలుగు’’. ఈ ఆపరేషన్ లో భాగంగా ఏక కాలంలో 17 చోట్ల దాడులు జరిగాయి. పంజ్‌గుర్, సురబ్, కెచ్, ఖరన్ జిల్లాల్లో దాడులు జరిగాయి. పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ, పోలీసులపై దాడులు జరిగాయి. ఈ దాడులకు తామే బాధ్యత వహిస్తున్నట్లు బీఎల్ఎఫ్ ప్రతినిధి మేజర్ గ్వాహ్రమ్ బలోచ్ ప్రకటించారు.

Read Also: Kolkata: కోల్‌కతాలో మరో అత్యాచార ఘటన.. ఐఐఎం క్యాంపస్‌లో విద్యార్థినిపై రేప్..

బలూచిస్తాన్‌లో పాక్ ఆర్మీని వణికిస్తున్నారు. ఈ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో మాత్రమే పాకిస్తాన్ అధికారం ఉంది. మిగతా ప్రాంతాలు అన్నీ బీఎల్ఎఫ్ ఆధీనంలోకి వెళ్లాయి. ఆపరేషన్ బామ్‌కు ముందు 2024లో మే, జూన్, జూలైలో ‘‘ఆపరేషన్ హెరాఫ్’’ దీని అర్థం నల్లతుఫాను. ఈ దాడులు కూడా పాక్ ఆర్మీని భయపెట్టింది. ఆ సమయంలో 102 పాక్ సైనికులు చనిపోయారు. ఏకంగా 50 స్థావరాలపై దాడులు చేశారు.

బలూచిస్తాన్‌ పాకిస్తాన్‌లో అతిపెద్ద ప్రావిన్సు. దాదాపు 40 శాతం భూభాగం ఉంటుంది. సహజ వనరులకు కేంద్రంగా ఉంది. అయితే, ఈ వనరులను బలూచ్‌లకు దక్కకుండా పాకిస్తాన్ పంజాబ్, చైనా కొల్లగొడుతోందని బలూచ్ వీరులు చెబుతున్నారు. దీంతో గత 20 ఏళ్లుగా బీఎల్ఎఫ్ పాక్ ప్రభుత్వంపై తిరుగుబడుతోంది. కొన్ని నెలల క్రితం బీఎల్ఎఫ్ ఏకంగా ‘‘జఫర్ ఎక్స్‌ప్రెస్’’ హైజాక్ జరిగింది. ఈ హైజాక్‌లో పాక్ ఆర్మీ, ఇంటెలిజెన్స్ అధికారుల్ని బీఎల్ఎఫ్ హతమార్చింది.

Exit mobile version