కరోనా మహమ్మారి రోజు రోజుకు పెరిగిపోతున్నది. అనేక రకాల వేరియంట్లు భయాందోళనలు కలిగిస్తున్నాయి. దీని నుంచి రక్షణ పొందేందుకు ప్రస్తుతం కొన్ని రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, అన్ని రకాల వైరస్ వేరియంట్ల నుంచి రక్షణ పొందేందుకు ఒకటే టీకాను తీసుకొచ్చేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా శరీరంలో టి కణాల ఉత్పత్తి పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. అయితే, టి కణాల ఉత్పత్తి పెంచడం అన్ని ఒమిక్రాన్ తో సహా అన్ని రకాల వేరియంట్ల నుంచి రక్షణ కల్పించేందుకు అవకాశం ఉంటుందని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Read: అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి షాక్.. మంత్రి, మరో ఎమ్మెల్యే రాజీనామా..
రెండోతరం సార్వత్రిక టీకాల తయారీకి ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వైరస్ సోకినపుడు టీ కణాల స్పందన ఆధారంగా టీకాలను తయారు చేయనున్నట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. టీకాలు తీసుకున్నప్పుడు యాంటీబాడిల వలన వైరస్ స్పైక్ ప్రోటీన్‌లపై ఒత్తిడి ఏర్పడుతుంది. దీనికి భిన్నంగా కరోనా మహమ్మారి వేరియంట్లలో వైరస్ లోపల ఉత్పరివర్తనాలు జరుగుతుంటాయి. ఈ టి కణాలు వాటిని లక్ష్యంగా చేసుకొని ఉత్పరివర్తనాలను నిలుపుదల చేసే విధంగా పనిచేసే విధంగా సార్వత్రిక టీకాలను తయారు చేయనున్నారు.
