NTV Telugu Site icon

Benjamin Netanyahu: విజయానికి అడుగు దూరం, అప్పటి వరకు కాల్పుల విరమణ లేదు: ఇజ్రాయిల్..

Netanyahu

Netanyahu

Benjamin Netanyahu: గతేడాది అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మంది చంపేసింది. మరో 240 మందిని కిడ్నాప్ చేసి గాజా స్ట్రిప్ ప్రాంతంలోకి తీసుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ పాలస్తీనా భూభాగాలైన గాజా, వెస్ట్ బ్యాంక్‌పై యుద్ధం చేస్తూనే ఉంది. ఈ రోజుతో ఈ యుద్ధం ప్రారంభమై 7 నెలలు కావస్తోంది. ఇప్పటికే వందలాది మంది బందీలు హమాస్ చెరలోనే ఉండగా.. అమాయకమైన పాలస్తీనా ప్రజలు 33,000 మంది మరణించారు.

ఇదిలా ఉంటే సంధి కోసం పలు దేశాలు ప్రయత్నిస్తున్నా కూడా కాల్పుల విరమణ కుదరడం లేదు. తాజాగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాట్లాడుతూ.. విజయానికి అడుగుదూరంలోనే ఉన్నామని, అప్పటి వరకు కాల్పుల విరమణ ఉండదని స్పష్టం చేశారు. హమాస్ బందీలందరిని విడిచిపెట్టే వరకు సంది ఉండదని చెప్పారు. ఈ దాడిలో మేము చాలా మూల్యాన్ని చెల్లించామని ఆయన అన్నారు. బందీలు తిరిగి రాకుండా కాల్పుల విరమణ ఉండదని చెప్పారు.

Read Also: Tata Madhu: తన స్వార్థం కోసం నియోజవర్గ ప్రజలను అవహేళన చేశాడు.. తెల్లం వెంకట్రావుపై కీలక వ్యాఖ్యలు

ఇజ్రాయిల్ ఒప్పందానికి సిద్ధంగా ఉంది, కానీ లొంగిపోవడానికి కాదని నెతన్యాహూ అన్నారు. ఇజ్రాయిల్‌పై అంతర్జాతీయ ఒత్తిడి హమాస్ తన స్థావరాలను బలోపేతం చేసుకోవడానికి మాత్రమే కారణమవుతుందని, అంతర్జాతీయ సమాజం ఒత్తిడి హమాస్‌కి వ్యతిరేకంగా ఉండాలని, ఇది బందీల విడుదల ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. ఏప్రిల్ 1న గాజాలో వైమానిక దాడిలో యూఎస్ ఫుడ్ ఛారిటీ వరల్డ్ కిచెన్‌కి చెందిన ఏడుగురు సభ్యులు మరణించారు. దీంతో అమెరికాతో పాటు వెస్ట్రన్ దేశాలు ఇజ్రాయిల్‌పై ఆగ్రహంతో ఉన్నాయి. యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ గురువారం నెతన్యాహూకి ఫోన్ చేసి తక్షణం కాల్పుల విరమణకు డిమాండ్ చేశారు. ఇజ్రాయిల్‌కి వ్యతిరేకంగా అనేక దాడుల వెనక ఇరాన్ తన ప్రాక్సీలను ఉంచుతోందని నెతన్యాహూ ఆరోపించారు.