Benjamin Netanyahu: విజయానికి అడుగు దూరం, అప్పటి వరకు కాల్పుల విరమణ లేదు: ఇజ్రాయిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Benjamin Netanyahu: గతేడాది అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మంది చంపేసింది. మరో 240 మందిని కిడ్నాప్ చేసి గాజా స్ట్రిప్ ప్రాంతంలోకి తీసుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ పాలస్తీనా భూభాగాలైన గాజా, వెస్ట్ బ్యాంక్‌పై యుద్ధం చేస్తూనే ఉంది. ఈ రోజుతో ఈ యుద్ధం ప్రారంభమై 7 నెలలు కావస్తోంది. ఇప్పటికే వందలాది మంది బందీలు హమాస్ చెరలోనే ఉండగా.. అమాయకమైన పాలస్తీనా ప్రజలు 33,000 మంది మరణించారు.
ఇదిలా ఉంటే సంధి కోసం పలు దేశాలు ప్రయత్నిస్తున్నా కూడా కాల్పుల విరమణ కుదరడం లేదు. తాజాగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాట్లాడుతూ.. విజయానికి అడుగుదూరంలోనే ఉన్నామని, అప్పటి వరకు కాల్పుల విరమణ ఉండదని స్పష్టం చేశారు. హమాస్ బందీలందరిని విడిచిపెట్టే వరకు సంది ఉండదని చెప్పారు. ఈ దాడిలో మేము చాలా మూల్యాన్ని చెల్లించామని ఆయన అన్నారు. బందీలు తిరిగి రాకుండా కాల్పుల విరమణ ఉండదని చెప్పారు.
Also Read
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
Read Also: Tata Madhu: తన స్వార్థం కోసం నియోజవర్గ ప్రజలను అవహేళన చేశాడు.. తెల్లం వెంకట్రావుపై కీలక వ్యాఖ్యలు
ఇజ్రాయిల్ ఒప్పందానికి సిద్ధంగా ఉంది, కానీ లొంగిపోవడానికి కాదని నెతన్యాహూ అన్నారు. ఇజ్రాయిల్‌పై అంతర్జాతీయ ఒత్తిడి హమాస్ తన స్థావరాలను బలోపేతం చేసుకోవడానికి మాత్రమే కారణమవుతుందని, అంతర్జాతీయ సమాజం ఒత్తిడి హమాస్‌కి వ్యతిరేకంగా ఉండాలని, ఇది బందీల విడుదల ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. ఏప్రిల్ 1న గాజాలో వైమానిక దాడిలో యూఎస్ ఫుడ్ ఛారిటీ వరల్డ్ కిచెన్‌కి చెందిన ఏడుగురు సభ్యులు మరణించారు. దీంతో అమెరికాతో పాటు వెస్ట్రన్ దేశాలు ఇజ్రాయిల్‌పై ఆగ్రహంతో ఉన్నాయి. యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ గురువారం నెతన్యాహూకి ఫోన్ చేసి తక్షణం కాల్పుల విరమణకు డిమాండ్ చేశారు. ఇజ్రాయిల్‌కి వ్యతిరేకంగా అనేక దాడుల వెనక ఇరాన్ తన ప్రాక్సీలను ఉంచుతోందని నెతన్యాహూ ఆరోపించారు.
తాజావార్తలు
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!