NTV Telugu Site icon

Butter chicken: “బటర్ చికెన్” వ్యక్తి ప్రాణం తీసింది..

Butter Chicken

Butter Chicken

Butter chicken: ఇంగ్లాండ్‌కి చెందిన 27 ఏళ్ల వ్యక్తి బటర్ చికెన్ కారణంగా మరణించాడు. దేశంతో పాటు విదేశాల్లో కూడా ప్రసిద్ధి చెందిన ఈ ప్రముఖ వంటకం కారణంగా ఒకరు మరణించాడు. టేక్ అవే నుంచి బటర్ చికెన్ తీసుకెళ్లిన తర్వాత జోసెఫ్ హిగ్గిన్సన్‌, దాన్ని తింటున్న క్రమంలో తీవ్రమైన ‘అలర్జీ’ బారిన పడ్డాడు. గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఇంగ్లాండ్‌లోని గ్రేటర్ మాంచెస్టర్‌లోని బరీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Read Also: Earthquake: ఫిలిప్పీన్స్‌, అండమాన్ సముద్రంలో భూకంపం

జోసెఫ్‌కి ‘అనాఫిలాక్సిన్’ అని పిలువబడే బాదంపప్పు వంటి గింజల వల్ల వచ్చే అలెర్జీ ఉంది. ఈ ప్రాణాంతక అలెర్జీ ప్రతిచర్య ద్వారా ఆయన ప్రాణాలు కోల్పోయాడు. బటర్ చికెన్‌లో బాదంపప్పు ఉందని తెలిసినా కూడా అతను దాన్ని తిన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇలాగే గింజలు ఉన్న ఆహారాన్ని తీసుకున్నప్పడు అలెర్జీని తట్టుకున్నాడు. అయితే, ఈ సారి మాత్రం బటర్ చికెన్ తిన్న వెంటనే ప్రాణాంతక అలెర్జీకి గురయ్యాడు. భోజనం చేస్తున్న సమయంలోనే గుండెపోటుకు గురయ్యాడు.

అతని మరణంపై దర్యాప్తు చేసిన అధికారులు, టేక్ అవే నుంచి తీసుకువచ్చిన ఆహారంలో ఎలాంటి తప్పు కనిపించలేదని చెప్పారు. జోసెఫ్‌కి గత కొంత కాలంగా అలెర్జీ ఉన్నట్లు తెలిసింది. ఆడ్రినలిన్‌తో సహా తక్షణ వైద్యం అందించినప్పటికీ అతని ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా క్షీణించింది. ఈ ఘటన డిసెంబర్ 28, 2022లో ఫ్యామిలీలో భోజనం చేస్తు్న్న సమయంలో జరిగింది. ఈ కేసులో బాదంపప్పు అనేది మరణానికి కారణమైనట్లు తెలుస్తోంది. అతడిని బతికించేందుకు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జనవరి 4, 2023లో మరణించాడు.

పాథాలజిస్ట్ డాక్టర్ ఫిలిప్ లంబ్ కరోనర్ కోర్టులో మాట్లాడుతూ.. 27 ఏళ్ల జోసెఫ్ బటర్ చికెన్ తిన్న వెంటనే అలెర్జీకి గురయ్యాడని చెప్పాడు. విచారణ తర్వాత జోసెఫ్ సోదరి ఎమిలీ మాట్లాడుతూ.. అలెర్జీ ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడు పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలని చెప్పారు. ఆమె తన సోదరుడి గుండె, కిడ్నీలను దానం చేసినట్లు చెప్పారు.

Show comments