NTV Telugu Site icon

Blaze Star: జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే చూసే ఖగోళ అద్భుతం..80 ఏళ్ల తర్వాత కొత్త నక్షత్రం..

Blaze Star

Blaze Star

Blaze Star: ఈ విశ్వంలో ఖగోళ అద్భుతాలకు లెక్క లేదు. మానవుడు విశ్వాన్ని ఎంత క్షుణ్ణంగా పరిశీలించినా, ఏదో ఒక కొత్త విషయం మిగిలే ఉంటుంది. గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు, బ్లాక్ హోల్స్ ఇలా ప్రతీది మానవుడికి సవాల్ విసురుతూనే ఉంటుంది. ఇదిలా ఉంటే, మానవ జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే చూసే అరుదైన ఖగోళ అద్భుతం జరగబోతోంది. ‘‘బ్లేజ్ స్టార్’’ లేదా ‘‘ T కరోనా బొరియాలిస్’’ అని పిలిచే నక్షత్రం 80 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఆకాశంలో దర్శనమివ్వబోతోంది.

Read Also: Shivraj Chouhan: జార్ఖండ్‌లో ఎన్ఆర్‌సీ అమలు చేసి, బంగ్లాదేశ్ చొరబాటుదారుల్ని ఏరేస్తాం..

ఇప్పుడు ఈ నక్షత్రం శాస్త్రవేత్తలతో పాటు ఖగోళ ఔత్సాహికుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. 1946లో చివరిసారిగా ఇది కనిపించింది. నార్తర్న్ క్రౌన్ నక్షత్రమండలంలో విస్పోటనం చెందిన సమయంలో భూమి నుంచి చివరిసారిగా ఈ నక్షత్రం కనిపించింది. ఇప్పుడు సెప్టెంబర్ నెలలో మళ్లీ కనిపిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం.. ఏ క్షణంలో అయినా ఈ నక్షత్రం ఆకాశంలో దర్శనమిస్తుందని చెబుతున్నారు.

భూమి నుంచి 3000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ‘‘చనిపోయిన నక్షత్రం’’ వల్ల ఈ ఖగోళ అద్భుతం ఏర్పడుతుంది. మరోసారి భారీ పేలుడుతో ఇది నక్షత్రంలా కనిపిస్తుంది. ‘‘నార్త్ స్టార్’’(ధృవ నక్షత్రం) అంతటి ప్రకాశవంతంగా ఆకాశంలో అద్భుతంగా కనిపిస్తుంది. ‘‘నోవా’’ కొన్ని రోజుల పాటు కనిపించి అదృశ్యమవుతుంది. మరో 80 ఏళ్ల తర్వాతే కనిపిస్తుంది. శాస్త్రవేత్తల ప్రకారం.. ఒక నక్షత్రం విస్పోటనం చెందడం మానవ జీవితంలో చూడటం చాలా అరుదు. ఈ నక్షత్రాన్ని మొదటిసారిగా 1217లో జర్మనీ ఉర్స్‌బెర్గ్‌కి చెందిన బుర్చర్డ్ అనే వ్యక్తి రికార్డ్ చేశాడు. అతడు దీనిని ‘‘ఒకసారి గొప్ప కాంతితో ప్రకాశించే పెద్ద నక్షత్రం’’గా అభివర్ణించాడు.

Show comments