Omicron may cause another corona wave..WHO warning: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య తగ్గినప్పటికీ.. మహమ్మారి ముప్పు పూర్తిగా తొలిగిపోలేదు. ఇప్పటికే చాలా దేశాల్లో కరోనా వేరియంట్ ఓమిక్రాన్ నుంచి సబ్ వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్ ఇలా వరస వేరియంట్లు కరోనా వేవ్ లకు కారణం అవుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓమిక్రాన్ సబ్ వేరియంట్లు ప్రపంచవ్యాప్తంగా మరో కోవిడ్-19 వేవ్ కు కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ.. ఓమిక్రాన్ XBB సబ్‌వేరియంట్‌తో మరోక ఇన్ఫెక్షన్ చూడవచ్చని అన్నారు.
అభివృద్ధి చెందుతున్న దేశాల వ్యాక్సిన్ తయారీ నెట్వర్క్ సమావేశంలో ఆమె ప్రసంగించారు. అయితే కొత్త వేరియంట్ వైద్యపరంగా తీవ్రంగా ఉన్నాయని సూచించడానికి ఇప్పటి వరకు ఏ దేశం నుంచి డేటా లేదని స్పష్టం చేశారు. ఓమిక్రాన్ లో ఇప్పటి వరకు 300కు పైగా సబ్ వేరియంట్నను గుర్తించారు. అయితే ప్రస్తుతం XBB సబ్‌వేరియంట్ వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఇది రికాంబినెంట్ వైరస్. ఇప్పటివరకు చాలా రీకాంబినెంట్ వేరియంట్లను గుర్తించారు. చాలా రీకాంబినెంట్ వైరస్ లు వ్యాధినిరోధక శక్తిని తప్పించుకుంటున్నాయి. XBB సబ్‌వేరియంట్ కారణంగా మరో కరోనా వేవ్ చూడవచ్చని సౌమ్య స్వామినాథన్ అన్నారు.
Read Also: Rozgar Mela: రానున్నది జాబుల జాతర.. మోదీ చేతుల మీదుగా ముహూర్తం
తాము BA.5, BA.1 వేరియంట్లను చూశామని.. వీటి ద్వారా వ్యాధి వేగంగా వ్యాపించడంతో పాటు రోగనిరోధక శక్తిని ఏమార్చేవని ఆమె అన్నారు. గత కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పరీక్షలు తగ్గిపోయామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ వారం 8,000 నుంచి 9,000 కరోనా కేసులు నమోదు అవుతున్నట్లు ఆమె తెలిపారు. మహమ్మారి ముగియలేదని.. నివారణ చర్యలు కొనసాగించాలని ఆమె అన్నారు. టీకాల ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకట్టవేయవచ్చని తెలిపారు. ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ పొందేందుకు మాస్కులు తప్పనిసరిగా ఉపయోగించాలని కోరారు.
