కరోనా మహమ్మారి విజృంభణతో అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి… అవసరాలను బట్టి కొన్ని ప్రత్యేక సర్వీసులను మాత్రమే తిప్పారు.. క్రమంగా కొన్ని రూట్లతో విమానసర్వీసులను నడుపూ వస్తున్నా.. అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందే లేదు.. అయితే, కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత క్రమంగా సాధారణ పరిస్థితులు రావడంతో.. డిసెంబర్ 15వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని ఈ నెల 26వ తేదీన కేంద్రం ప్రకటించింది.. కానీ, మళ్లీ ఇప్పుడు పునరాలోచనలో పడిపోయింది కేంద్రం.. దానికి కారణం.. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్… ఈ కొత్త వేరియంట్ పలు దేశాల్లో గుబులు పుట్టిస్తోంది.. గత వేరియంట్ల కంటే ఇది చాలా ప్రాణాంతకమని, వేగంగా వ్యాపిస్తుందని నివేదికలు హెచ్చరిస్తున్నారు.. ఈ తరుణంలో అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడిపోయింది.
ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించడంపై సమీక్షించింది కేంద్రం… కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా అధ్యక్షతన జరిగిన హైలెవల్ మీటింగ్ నిర్వహించారు.. కోవిడ్ కొత్త వేరియంట్ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ విమానాలను తిరిగి ప్రారంభించాలనే నిర్ణయాన్ని సమీక్షించింది.. అయితే, ఎప్పటి నుంచి పూర్తిస్థాయిలో విమాన సర్వీసులు ప్రారంభించాలి అనే దానిపై మాత్రం ఓ నిర్ణయానికి రానట్టుగా తెలుస్తోంది.. కాగా, కోవిడ్ కారణంగా గత ఏడాది మార్చి 23 నుంచి దాదాపు 20 నెలలుగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నడవడంలేదు.. అయితే, 31 దేశాలతో బబుల్ ఒప్పందం మేరకు గత ఏడాది జులై నుంచి కొన్ని సర్వీసులు నడుపుతున్నారు.. వచ్చే నెల నుంచి పూర్తిస్థాయిలో నడపాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. ఒప్పుడు కొత్త వేరియంట్ కలవరంతో అది కూడా వాయిదా పడే అవకాశం ఉందంటున్నారు.