NTV Telugu Site icon

USA: శృంగారం తర్వాత పురుషులను హత్య చేస్తున్న మహిళ.. చివరకు చిక్కింది..

Ohio Women

Ohio Women

USA: అమెరికాలో ఓ మహిల దారుణ హత్యలకు పాల్పడింది. శృంగారం కోసం వచ్చే పురుషుల్ని చంపేసింది. రెబెక్కా ఆబోర్న్ అనే 33 ఏళ్ల మహిళ, పురుషులతో సెక్స్ తర్వాత వారికి ప్రాణాంతక మత్తుపదార్థాలు ఇచ్చి చంపేసేది, ఆ తరువాత వారిని దోచుకునేది. ఇలా నలుగురిని హత్యలు చేసిన రెబెక్కాపై పోలీసులు బుధవారం అభియోగాలు మోపారు.

ఒహియోలోని కోలంబస్‌లో సెక్స్ పాల్గొన్న పురుషుల వరస హత్యలు జరిగాయి. దీని వెనక ఒహియోకు చెందిన రెబెక్కా ఆబోర్న్ ఉన్నట్లు ఓహియో అటార్నీ జనరల్ డేవ్ యోస్ట్ తెలిపారు. ఒక బిడ్డకు తల్లైన రెబెక్కా నలుగురిని మత్తుమందు ఇచ్చి చంపేసి, ఆ తర్వాత దోచుకున్నట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. ఈ ఏడాది నాలుగు హత్యలు చేసింది, అంతకుముందు ఏడాది డిసెంబర్ నెలలో ఓ వ్యక్తికి హైడోస్ డ్రగ్స్ ఇచ్చేందుకు ప్రయత్నించిన సమయంలో అతను దాడి నుంచి బయటపడ్డాడని యోస్ట్ తెలిపారు.

Read Also: Rahul Gandhi: బీజేపీ రైతుల రుణాలని మాఫీ చేయదు..కానీ అదానీ రుణాలను మాఫీ చేస్తుంది..

ఆబోర్న్ బారిన పడిన వ్యక్తులు ఇంకా చాలా మంది ఉండే అవకాశం ఉందని ఆయన అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రాణాలతో బయటపడిన వారు ఈ కేసులో ముందుకు రావాలని కోరారు. ఇలా హైడోస్ మరణాలు వరసగా జరుగుతున్న క్రమంలో ఓ కీలక సమాచారం లభించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చిందని అధికారులు తెలిపారు. కొలంబస్ డివిషన్ ఆఫ్ పోలీస్ మరియు ఓహియో బ్యూరో ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విచారణలో ఆబోర్న్ ఈ హత్యలకు పాల్పడినట్లు తెలిసింది.

ఆబోర్న్ కి ఒక బిడ్డ ఉండేదని, 2016లో బిడ్డ చనిపోయిందని, ఆబోర్న్ కి ముందస్తు నేర చరిత్ర లేదని, అయినప్పటికీ ఆమెకు హత్య, దోపిడి, సాక్ష్యాలు తారుమారు చేయడం, డ్రగ్స్ అక్రమ రవాణా వంటి నేరాలను ఎదుర్కొంటోంది. ఈమె బారిన పడిన వ్యక్తులు ముందుకు రావాలని, వారికి రక్షణ కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

Show comments