North Korea: ఉత్తర కొరియా గురించి ప్రపంచానికి తెలిసింది తక్కువ. అ దేశంలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియదు. కేవలం ఆ దేశం అణు ప్రయోగాలను మాత్రమే అక్కడి జాతీయ మీడియా ఛానెల్ చెబుతుంది. అయితే తాజాగా దక్షిణ కొరియా నివేదిక ప్రకారం ఉత్తర కొరియా ప్రభుత్వం తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘనటకు పాల్పడుతున్నట్లు తేలింది. ప్రజలు ‘జీవించే హక్కు’ అక్కడి ప్రభుత్వం కాలరాస్తోంది.
Read Also: Akanksha Dubey: హోటల్ గదిలో ఉరేసుకున్న నటి.. చివరగా ఆమెతో గడిపిందెవరు..?
మాదకద్రవ్యాలు వాడినా, దక్షిణ కొరియా ఇతర పాశ్యాత్య దేశాల సినిమాలు, డ్రామాలు చూసినా, మతపరమైన కార్యక్రమాల్లో పాలుపంచుకున్నా.. ప్రజలను నిర్దాక్షిణ్యంగా ఉరి తీస్తోంది. ఇటీవల పాశ్యాత దేశాలకు సంబంధించిన సినిమా చూసినందుకు ఇద్దరు టీనేజీ విద్యార్థులను ఉరి తీసి చంపేసింది కిమ్ సర్కార్. 2017 నుంచి 2022 వరకు దాదాపుగా 500 మంది ఉత్తర కొరియా నుంచి పారిపోయారు. వారి నుంచి సేకరించిన వివరాలతో 450 పేజీల నివేదిక తయారు చేసింది దక్షిణ కొరియా.
అయితే ఈ ఆరోపణలను ఉత్తర కొరియా ఖండించింది. తమ పాలనను పడగొట్టే విధంగా కుట్రలో భాగంగా ఈ నివేదిక వచ్చిందని విమర్శించింది. బహిరంగ ఉరి శిక్షలు, చిత్ర హింసలు, ఏకపక్ష అరెస్టులు ఇలా ఉత్తకొరియాలో అరాచక పాలన కారణంగా ప్రజలు హక్కులు హననానికి గురవుతున్నాయని నివేదిక వెల్లడించింది. ఉత్తర కొరియా సరిహద్దుల్ని దాటేందుకు ప్రయత్నించి పట్టుబడిన వారిని ఉరి తీసినట్లు నివేదిక పేర్కొంది. ఉత్తర కొరియా తన అణ్వాయుధ, క్షిపణి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంది తప్పితే.. ప్రజలు జీవితాన్ని పట్టించుకోవడం లేదని దక్షిణ కొరియా ఆరోపించింది. ఉత్తర కొరియా నిర్భందం తట్టుకోలేక దాదాపుగా 34,000 మంది దక్షిణ కొరియాలో స్థిరపడ్డారు.