NTV Telugu Site icon

North Korea: K-పాప్, సినిమాలు షేర్ చేయడమే పాపం.. బహిరంగా మరణశిక్షలు విధిస్తున్న కిమ్..

Kim

Kim

North Korea: కిమ్ జోంగ్ ఉన్ పాలనలో ఉన్న ఉత్తర కొరియా ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. కిమ్, కిమ్ తాత, కిమ్ తండ్రి గురించి ప్రగల్భాలు పలకడంతోనే ఆ దేశం నడుస్తోంది. ప్రాపగండాలో అక్కడ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో అనే విషయం కూడా అక్కడి ప్రజలకు తెలియదంటే అతిశయోక్తి కాదు. ఇక అక్కడ విచిత్రమైన చట్టాలు, శిక్షలు ఏ దేశంలో కూడా ఉండదు. అమెరికా, దక్షిణ కొరియా అంటే ద్వేషించి నార్త్ కొరియా, అక్కడి ప్రజలు ఈ రెండు దేశాలకు సంబంధించిన విషయాలతో సంబంధం ఉందని తెలిస్తే అక్కడి అధికారులు దారుణంగా చంపేస్తారు.

పలు సందర్భాల్లో కే-పాప్ మ్యూజిక్ విన్నందుకు, కొరియన్ సినిమాలు చూసినందుకు నిర్ధాక్షిణ్యంగా అక్కడి ప్రజలను ఉరితీయడం, బహిరంగంగా కాల్చి చంపడం వంటి శిక్షల్ని విధిస్తుంటుంది. సియోల్-2020 చట్టం ప్రకారం దక్షిణ కొరియా టీవీ సిరీస్‌లు, సినిమాలు, కే-పాప్ మ్యూజిక్ షేర్ చేస్తూ పట్టుబడిన వ్యక్తులకు కిమ్ జోంగ్ ఉన్ పాలన బహిరంగంగా మరణశిక్ష విధించిందని దక్షిణకొరియా మంత్రిత్వ శాఖ జూన్ 27న తెలిపింది.

Read Also: Delhi Rains : ఢిల్లీలో కుండపోత వర్షంపై ఐఎండీ అంచనా విఫలం.. ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు

దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ‘‘2024 ఉత్తర కొరియా మానవ హక్కుల నివేదిక ప్రకారం’’, ఇటీవల కాలంలో బహిరంగ మరణశిక్షలు పెరిగాయని చెప్పింది. దక్షిణ కొరియాతో పాటు వెస్ట్రన్ దేశాలు, శత్రుదేశాలకు సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉండటం, ఇతరులతో పంచుకోవడం వంటివి చేస్తే ఉత్తరకొరియాలో మరణశిక్షలు విధిస్తుంది. 2022లో సౌత్ హ్వాంగ్‌హే ప్రావిన్స్‌లోని ఒక గనిలో 22 ఏళ్ల వ్యవసాయ కార్మికుడిని బహిరంగంగా మరణశిక్ష విధించినట్లు నివేదిక పేర్కొంది. నిందితుడు దక్షిణ కొరియాకు చెందిన 70 పాటలను విన్నందుకు, 3 సినిమాలు చూసినందుకు వారిని అరెస్ట్ చేశారు. అతను మరో ఏడుగురికి వీటిని షేర్ చేశారని అభియోగాలు ఎదుర్కొన్నారు.

మొదటగా ఈ మెటీరియల్ తీసుకువచ్చిన వ్యక్తులకు కఠిన శిక్షల ఉంటాయి. ఫైరింగ్ స్వ్కాడ్ ద్వారా వీరిని బహిరంగంగా కాల్చి చంపుతారు. ఆ తర్వాత దీంట్లో ఉన్నవారి తప్పును బట్టి శిక్ష విధిస్తున్నారు. 2023 నాటికి ఉత్తర కొరియా విడిచి పారిపోయిన 649 మంది సాక్ష్యాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.