Site icon NTV Telugu

ఉత్త‌ర కొరియాలో తీవ్ర‌మైన ఆహార‌కొర‌తః కిలో అర‌టిపండ్లు ఎంతంటే…

ఉత్త‌ర కొరియాలోని ప్ర‌జ‌లు తీవ్ర‌మైన ఆహార కొర‌త‌ను ఎదుర్కొంటున్న‌ట్టు ఆ దేశాధ్య‌క్షుడు కిమ్ స్వ‌యంగా పేర్కోన్నారు.  టైఫూన్ వ‌ర‌ద‌లు రావ‌డంతో ఈ ఏడాది వ్య‌వసాయ రంగం ల‌క్ష్యాల‌ను చేరుకోలేక‌పోయింద‌ని కిమ్ పేర్కొన్నారు.  అయితే, ప్ర‌స్తుత ప‌రిస్తితులు కొంత ఆశాజ‌న‌కంగా ఉండ‌టంతో పారిశ్రామికంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కిమ్ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు ఆ దేశ అధికారిక మీడియా తెలియ‌జేసింది.  క‌రోనా విజృంభ‌ణ కార‌ణంగా దేశ స‌రిహ‌ద్దుల‌ను మూసేసింది.  

Read: 5 భారీ చిత్రాల రిలీజ్ కు టాప్ బ్యానర్ రెడీ

క‌రోనా స‌మ‌యంలో తీవ్ర‌మైన ఆంక్ష‌ల‌ను అమ‌లు చేయ‌డంతో దేశంలోని ఆహార నిల్వ‌లు అడుగంటిపోయాయి.  కిలో అర‌టిపండ్లు 46 డాల‌ర్లు ప‌లుకుతున్న‌ది.  ఫుడ్‌, ప్యూయ‌ల్‌, ఫెర్టిలైజ‌ర్స్ వంటి వాటికోసం చైనామీద‌నే ఎక్కువ‌గా ఆధార‌ప‌డుతుంది.  చైనాతో స‌రిహ‌ద్దులు మూసేయ‌డంతో ఆ దేశం నుంచి దిగుమ‌తి త‌గ్గిపోయింది.  1990లో ఒక‌సారి దేశంలో క‌రువు ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.  ఆ స‌మ‌యంతో ఆక‌లితో అల‌మ‌టించి 30 ల‌క్ష‌ల మంది వ‌రకు మృత్యావాత ప‌డిన‌ట్లు నిపుణులు చెబుతున్నారు.  

Exit mobile version