Kim Jong Un: సైన్యాన్ని నిజమైన యుద్ధం కోసం విన్యాసాలు తీవ్రతరం చేయాలని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించినట్లు ఆ దేశ అధికారిక మీడియా కేసీఎన్ఏ వెల్లడించింది. తన రెండో కుమార్తెతో కలిసి సైనిక విభాగం ఫైర్ డ్రిల్ ను కిమ్ పర్యవేక్షించినట్లు పేర్కొంది. అధికారిక మీడియా ఫోటోల్లోని కిమ్, ఆయన కుమార్తె విడుదల చేసింది. ఇద్దరు నల్లటి జాకెట్లు ధరించి, యూనిఫాంలో ఉన్న అధికారులతో కలిసి గురువారం ఫిరంగి దళం చేపట్టిన క్షిపణి ఫైరింగ్ ను వీక్షించారు. నిన్న ఒక బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని గుర్తించామని దక్షిణ కొరియా సైన్యం పేర్కొంది. అదే ప్రదేశం నుంచి అనేక ప్రయోగాలు జరిగే అవకాశలున్నట్లు విశ్లేషిస్తున్నారని దక్షిణ కొరియా సైన్య వెల్లడించింది.
Bhatti Vikramarka: సామాజిక తెలంగాణ ఏర్పడాలంటే.. ధరణి పోర్టల్ తొలగించాలి
హస్వాంగ్ యూనిట్ ఒకేసారి కనీసం ఆరు క్షిపణులను పరీక్షించిందని.. దాడుల కోసం ఈ మిషన్ శిక్షణ తీసుకుందని కేసీఎన్ఏ అధికారులు ఫోటోలను రిలీజ్ చేశారు. కొరియా పశ్చిమ సముద్ర లక్షిత జలాల్లోకి హస్వాంగ్ విభాగం శక్తివంతమైన క్షిపణులను పరీక్షించినట్లు తెలిపింది. ఈ డ్రిల్ ను పరిశీలించిన ఉత్తర కొరియా అధినేత.. రెండు వ్యూహాత్మక మిషన్లు అంటే ఫస్ట్ ది యుద్దాన్ని నిరోధించడం.. రెండోది యుద్దంలో చొరవ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని సైనికులకు సూచించినట్లు తెలుస్తోంది. ఇటువంటి యూనిట్లు నిజమైన యుద్దం కోసం వివిధ పరిస్థితులలో విభిన్న రీతిలో వివిధ అనుకరణ డ్రిల్స్ ను స్థిరంగా తీవ్రతరం చేయాలి అని కిమ్ జోంగ్ ఉన్ పేర్కొన్నారు. దక్షిణ కొరియా-ఆమెరికా ఈ ఐదేళ్లలోనే అతి పెద్ద సంయుక్త సైనిక విన్యాసాలను సోమావారం నుంచి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న తరణంలో ఉత్తర కొరియాలో ఈ డ్రిల్ జరిగింది. ఉభయ కొరియాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఉత్తర కొరియా మరింత రెచ్చగొట్టేలా అణ్వాయుధ, క్షిపణి పరీక్షలను నిర్వహిస్తోంది. దీనికి ప్రతిస్పందనగా దక్షిణ కొరియా.. అగ్రరాజ్యం ఆమెరికాతో భద్రతా సహకారాన్ని తీసుకుంటోంది.
కాగా.. అగ్రరాజ్యం ఆమెరికాకు ఉత్తర కొరియా అధినేత సోదరి కిమ్ యో జోంగ్ రెండు రోజుల క్రితమే వార్నింగ్ ఇచ్చారు. అయిన ఆమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాపసాల పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము పరీక్షించే క్షిపణులను కూల్చివేస్తే, అది ఉత్తర కొరియాపై యుద్ధం ప్రకటించినట్టుగానే భావిస్తామని ఉత్తర కొరియా అధినేత సోదరి కిమ్ యో జోంగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియా వ్యూహాత్మకంగా క్షిపణి పరీక్షలు చేపడుతుందని, అందుకు వ్యతిరేకంగా ఆమెరికా చేపట్టే ఎలాంటి సైనిక చర్య అయినా అది యుద్ద ప్రకటనే అవుతుందని ఆమె తేల్చి చెప్పారు. ఆమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇది తమ ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచుతుందని ఉత్తర కొరియా వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగానే తమను రెచ్చగొడుతున్నారని కిమ్ జోంగ్ సోదరి కిమ్ యో జోంగ్ ఆరోపించారు. ఆమెరికా B-52 బాంబర్ ను దక్షిణ కొరియా ఫైటర్ జెట్ లతో జాయింట్ డ్రిల్ కోసం మోహరించింది. ఈ నేపథ్యంలో కిమ్ కూడా దూకుడు పెంచారు. ఉత్తర కొరియా సైన్యాన్ని యుద్దానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.