North Korea Launches More Missiles: ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ప్రపంచ హెచ్చరికల్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా.. వరుసగా మిస్సైల్స్ ప్రయోగాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. శనివారమే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన కొరియా.. ఇప్పుడు 48 గంటల్లోనే మరో క్షిపణి ప్రయోగాన్ని చేపట్టింది. తూర్పు సముద్రం దిశగా ఉత్తర కొరియా మిస్సైల్‌ను ప్రయోగించిందని దక్షిణకొరియా పేర్కొంది. అటు.. జపాన్ ప్రధాని కార్యాలయం సైతం నార్త్ కొరియా బాలిస్టిక్ మిస్సైల్‌ను ప్రయోగించిందని ట్వీట్ చేసింది. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా ఆదివారం ఎయిర్ డ్రిల్స్ నిర్వహించిన నేపథ్యంలో.. ఈ క్షిపణి ప్రయోగాల త్వారా కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరిక జారీ చేశారు. అటు.. కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ కూడా పసిఫిక్‌ను తమ ఫైరింగ్ రేంజ్‌గా మారుస్తామని హెచ్చరించింది. 600ఎంఎం రాకెట్ లాంచర్స్‌తో రెండు షాట్స్ కాల్చినట్టు నార్త్ కొరియా స్టేట్‌మెంట్ ఇచ్చింది.
Drive in Theatre: సినిమా ప్రియులకు పండగే.. ఇకపై కార్లలో కూర్చొనే సినిమా చూడొచ్చు
ఇదిలావుండగా.. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనిక కసరత్తులపై ఇప్పటికే ఉత్తర కొరియా స్పందించింది. అలాంటి విన్యాసాలు జరిపితే.. తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఈ క్రమంలోనే తాము మాటలు చెప్పడమే కాదు, చేతలతో చేసి నిరూపిస్తామంటూ.. ఈ రెండు క్షిపణి ప్రయోగాలు చేసి చూపించింది. తొలుత శనివారం మధ్యాహ్నం జపాన్ పశ్చిమ తీరంలో సముద్రంలోకి లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి హ్వాసాంగ్-15 (ICBM)ను ప్రయోగించింది. ఈ మిస్సైల్ 66 నిమిషాల పాటు ప్రయాణం చేసి, తమ ఎక్స్లూజివ్ ఎకనామిక్ జోన్‌లో పడిపోయినట్లుగా జపాన్ తెలిపింది. ఆ వెంటనే అమెరికాతో కలిసి దక్షిణ కొరియా ఆదివారం ఉదయం సంయుక్త వైమానిక విన్యాసాలను చేపట్టింది. ఇందులో అమెరికాకు చెందిన స్ట్రాటజిక్ బాంబర్ విమానాలు పాల్గొన్నాయని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన నార్త్ కొరియా.. తన బలం ఏంటో చాటేందుకు 48 గంటల వ్యవధిలోనే సోమవారం నాడు మరో క్షిపణి ప్రయోగం చేసింది.
Sandhya Sreedhar Rao: నేను ఎవరినీ మోసం చేయలేదు.. అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి
అసలే ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇక ఉత్తర కొరియా తనని తాను తిరుగులేని అణురాజ్యంగా ప్రకటించుకోవడం, నియంత కిమ్ జోంగ్ ఉన్ ఘాతాంక ఆయుధాల ప్రొడక్షన్‌ని అమాంతం పెంచేశాక.. ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు అత్యల్స స్థాయికి దిగజారిపోయాయి. ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో.. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నార్త్ కొరియా ఎప్పుడన్నా దక్షిణ కొరియాపై విరుచుకుపడొచ్చన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.