Site icon NTV Telugu

ఉత్త‌ర‌కొరియా దెబ్బ‌కు విల‌విల‌లాడుతున్న బ్లాక్‌చెయిన్ టెక్నాల‌జీ…

ప్ర‌పంచంలోని అంద‌రిదీ ఒక దారైతే, ఉత్త‌ర కొరియాది మ‌రోదారి.  ఆదాయం కోసం ఆ దేశం అనేక మార్గాల‌ను అన్వేషిస్తోంది.  ప్ర‌పంచ‌మంతా క‌రోనా నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలా అని ఆలోచిస్తుంటే నార్త్ కొరియా మాత్రం క్షిప‌ణీ ప్ర‌యోగాల‌తో బిజీగా మారింది.  మ‌రోవైపు ఆ దేశం హ్యాక‌ర్ల‌ను ప్రోత్స‌హిస్తూ ప్ర‌పంచ సంప‌ద‌ను కొల్ల‌గొడుతోంది.  ఇప్పుడు ఎవ‌రి నియంత్ర‌ణ‌లో లేని బ్లాక్ చెయిన్ టెక్నాల‌జీతో రూపొందిన క్రిఫ్టోక‌రెన్సీపై నార్త్ కొరియా క‌న్నేసింది.  క్రిఫ్టో క‌రెన్సీలో భారీగా పెట్టుబ‌డులు పెడుతున్న‌వారిపై హ్యాక‌ర్లు దృష్టి సారించి సంప‌ద‌ను కొల్ల‌గొడుతున్నారని ప్ర‌పంచ దేశాలు ఆరోపిస్తున్నాయి.  

Read: ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం

అయితే, త‌మ వ‌ద్ద ఎలాంటి హ్యాక‌ర్లు లేర‌ని, హ్యాక‌ర్లు ఇలాంటి హ్యాకింగ్‌కు పాల్ప‌డితే మ‌ర‌ణ‌శిక్ష‌లు విధిస్తామ‌ని అధ్య‌క్షుడు కిమ్ హెచ్చ‌రిస్తున్నాడు.  ఉత్త‌ర కొరియాకు చెందిన హ్యాక‌ర్లే ఇలాంటి దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని నిపుణులు చెబుతున్నారు.  దాదాపుగా 400 మిలియ‌న్ డాల‌ర్ల క్రిఫ్టో క‌రెన్సీ సొమ్మును కాజేశారు.  ఇప్ప‌టి వ‌ర‌కు ఏడు దాడులు జ‌రిగాయని బ్లాక్ చెయిన్ ఎనాల‌సిప్ కంపెనీ చెయినాలైసిస్ పేర్కొన్న‌ది.  నార్త్ కొరియా ఇంటిలిజెన్స్ స‌ర్వీస్ అండ‌దండ‌ల‌తోనే ల‌జార‌స్ గ్రూప్ ఈ ర‌క‌మైన హ్యాకింగ్‌కు పాల్ప‌డుతున్న‌ట్టు చెయినాలైసిస్ తెలియ‌జేసింది.  

Exit mobile version