NTV Telugu Site icon

త‌గ్గేదిలే: కిమ్ చెల‌గాటం… జ‌పాన్‌కు ప్రాణ‌సంక‌టం…

ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు మ‌ళ్లీ పాత‌ప‌ద్ద‌తికే వ‌చ్చేశారు.  అధికారంలోకి వ‌చ్చి ప‌దేళ్లు పూర్తైన సంద‌ర్భంగా కాస్త త‌గ్గిన‌ట్టు క‌నిపించినా… ఆ త‌రువాత త‌గ్గేది లేద‌ని కిమ్ చెప్ప‌క‌నే చెప్పాడు.  వారం క్రితం బాలిస్టిక్ క్షిప‌ణిని ప్ర‌యోగించి భ‌య‌పెట్టిన కిమ్‌, మ‌రోసారి క్షిప‌ణీ ప్ర‌యోగం చేసి షాక్ ఇచ్చాడు.  700 కిమీ ప‌రిధిలోని ల‌క్ష్యాల‌ను చేధించగ‌ల శ‌క్తి గ‌లిగిన ఈ బాలిస్టిక్ క్ష‌ప‌ణి ప్ర‌యోగం స‌క్సెస్ అయిన‌ట్టు ఉత్త‌ర కొరియా అధికారులు పేర్కొన్నారు.  ఈ ప్ర‌యోగంతో ద‌క్షిణ కొరియా ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయింది.  అటు జ‌పాన్ సైతం భ‌యంతో వ‌ణికిపోయింది.  స‌ముద్రంలోని త‌మ నౌక‌ల‌కు ఏమైనా ముప్పు వాట్టిల్లిందేమో అని సందేహాన్ని వెలిబుచ్చింది.  వెంటనే ద‌ర్యాప్తుకు జ‌పాన్ ప్ర‌భుత్వం ఆదేశించింది.  

Read: ఢిల్లీ పోలీసుల‌కు నెటిజ‌న్ల నుంచి వింత ప్ర‌శ్న‌లు… అదే స్టైల్లో ఆన్స‌ర్‌…

వారం రోజుల వ్య‌వ‌ధిలో రెండుసార్లు బాలిస్టిక్ క్షిప‌ణీని ఉత్త‌ర కొరియా ప్ర‌యోగించ‌డంతో చుట్టుప‌క్క‌ల దేశాల‌తో పాటు అటు అమెరికా కూడా అప్ర‌మ‌త్తం అయింది.  కిమ్ ఆయుధాల‌తో చెల‌గాటం అడుగున్నాడ‌ని, దీని వ‌ల‌న భ‌విష్య‌త్తులో ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.  ఎవ‌రెన్ని చెప్పినా కిమ్ త‌గ్గేది లేద‌ని అంటున్నాడు.