కరోనా నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకుండానే మరో కొత్త వైరస్ ఇంగ్లాండ్‌ను ఇబ్బందులు పెడుతున్నది. నోరో వైరస్ కేసులు ఆ దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. దీనిని వామిటింగ్ బగ్ అని కూడా పిలుస్తారు. ఇప్పటి వరకు ఈ కేసులు 154 నమోదైనట్టు బ్రిటన్ సీడీసీ పేర్కొన్నది. ప్రాణాంతకం కాకపోయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ సోకిన వారిలో వాంతులు, వికారం, జ్వరం, విరోచనాలు, ఒళ్లు నొప్పులు వంటివి ఉంటాయి. మూడు రోజులపాటు ఈ లక్షణాలు కనిపిస్తాయి. కలుషితమైన ఆహారం తీసుకోవడం వలన ఈ వైరస్ సోకుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. నిత్యం చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, మంచి ఆహరం తీసుకోవడం, పాత్రలను శుభ్రంగా ఉంచుకోవడం వంటివి చేయాలని నిపుణులు చెబుతున్నారు.
Read: నా ఒత్తిడితోనే ‘నారప్ప’ ఇలా వస్తోంది: కలైపులి ఎస్. థాను
