నా ఒత్తిడితోనే ‘నారప్ప’ ఇలా వస్తోంది: కలైపులి ఎస్. థాను

విక్టరీ వెంకటేశ్, ప్రియమణి కీలక పాత్రలు పోషించిన ‘నారప్ప’ సినిమా అమెజాన్ ప్రైమ్ లో మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. ‘ఈ సినిమాను మే 14న థియేటర్లలోనే విడుదల చేయాలని అనుకున్నామని, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నామ’ని ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన కలైపులి ఎస్. థాను చెప్పారు. 17 సంవత్సరాల క్రితం 2004లో వెంకటేశ్ తో ‘ఘర్షణ’ చిత్రం తెలుగులో తీసిన ఆయన మళ్లీ ఇంతకాలానికి ‘నారప్ప’ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ‘సురేశ్ బాబు సహకారంతో అనుకున్న విధంగానే ఈ చిత్రాన్ని పూర్తి చేశామని థియేట్రికల్ రిలీజ్ కోసమే తొలికాపీని సైతం సిద్ధం చేశామని, కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మరోసారి మూత పడటంతో నిర్ణయం మార్చుకోక తప్పలేద’ని థాను అన్నారు.

Read Also : అఫిషియల్ : రామ్ కు విలన్ గా కోలీవుడ్ స్టార్

‘ఈ యేడాది తాను తమిళంలో విడుదల చేసిన ధనుష్ చిత్రం ‘కర్ణన్’ చేదు అనుభవాన్ని మిగిల్చింద’ని కలైపులి ఎస్. ధాను వాపోయారు. సినిమా విడుదలైన మర్నాడే ఆక్యుపెన్సీని తగ్గించడం, ఆ తర్వాత థియేటర్లే మూతపడటంతో ఎంతో నష్టపోయానని ఆయన అన్నారు. అందుకే తొలికాపీ సిద్ధమైన ‘నారప్ప’ను పైరసీ కాకుండా కాపాడుకోకపోతే జరిగే భారీ నష్టాన్ని ఊహించి, ఓటీటీ విడుదలకు సురేశ్ బాబును ఒప్పించానని ఆయన అన్నారు. ఓ పంపిణీదారుడిగా నిజానికి ఓటీటీలో విడుదల చేయడం తనకూ ఇష్టం లేదని, కానీ పరిస్థితులు అలా వచ్చేశాయని తెలిపారు. కొవిడ్ 19తో కారణంగా తన కుటుంబ సభ్యులనే తాను థియేటర్లకు సినిమా చూడటానికి పంపనని, అలాంటప్పుడు వేరే వాళ్ళ థియేటర్లకు రావాలనుకోవడం కరెక్ట్ కాదని ధాను చెప్పారు. ఇప్పుడు కుటుంబ సభ్యులందరితో కలిసి ‘నారప్ప’ను ఇంట్లోనే ఓటీటీ ద్వారా చూడొచ్చని ఆయన అన్నారు. వెంకటేశ్ కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీగా ‘నారప్ప’ నిలుస్తుందని ధాను అభిప్రాయపడుతున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-