NTV Telugu Site icon

Nobel Prizes 2024: నోబెల్ బహుమతుల ప్రకటన.. వైద్యశాస్త్రంలో ఇద్దరికి బహుమతి

Nobel Prizes

Nobel Prizes

2024 సంవత్సరానికి గానూ వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి విజేతలను ప్రకటించారు. అమెరికాకు చెందిన విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. మైక్రోఆర్‌ఎన్‌ఏ (జన్యు కార్యకలాపాలను నియంత్రించే ప్రాథమిక సూత్రం)ను కనుగొన్నందుకు ఇద్దరికీ ఈ గౌరవం లభించింది. సోమవారం.. స్టాక్‌హోమ్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్ అసెంబ్లీ విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించింది.

Read Also: Sudheer Babu:’మా నాన్న సూపర్ హీరో’ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. అదే అసలు పాయింట్: హీరో సుధీర్ బాబు ఇంటర్వ్యూ

మానవ శరీరంలోని అన్ని కణాలు ఒకే జన్యువులను కలిగి ఉన్నప్పటికీ.. కండరాలు, నరాల కణాలు వంటి వివిధ రకాల కణాలు వేర్వేరు విధులను నిర్వహిస్తాయి. జన్యు నియంత్రణ కారణంగా ఇది సాధ్యమవుతుంది. ఇది కణాలకు అవసరమైన జన్యువులను మాత్రమే ‘ఆన్’ చేయడానికి అనుమతిస్తుంది. ఆంబ్రోస్, రువ్‌కున్‌ల మైక్రోఆర్‌ఎన్‌ఏల ఆవిష్కరణ ఈ నియంత్రణ జరగడానికి కొత్త మార్గాన్ని వెల్లడించింది. మానవులతో సహా జీవులు ఎలా అభివృద్ధి చెందుతాయి.. ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడంలో వారి ఆవిష్కరణ ముఖ్యమని నోబెల్ అసెంబ్లీ పేర్కొంది.

Read Also: ICC Women’s T20 World Cup: పాక్‌పై గెలిచినా భారత్‌కు సెమీఫైనల్‌ కష్టాలు..!

గత సంవత్సరం కాటలిన్ కారికో, డ్రూ వీస్‌మాన్‌లకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. న్యూక్లియోసైడ్ బేస్ మోడిఫికేషన్‌లకు సంబంధించిన ఆవిష్కరణలకు ఈ గౌరవం లభించింది. ఈ ఆవిష్కరణ కరోనా వైరస్ (COVID-19)కి వ్యతిరేకంగా సమర్థవంతమైన mRNA వ్యాక్సిన్‌ల అభివృద్ధిలో సహాయపడింది. ఇప్పటివరకు వైద్యశాస్త్రంలో 227 మంది నోబెల్ బహుమతి అందుకున్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్దంతి రోజైన డిసెంబర్ 10న జరిగే వేడుకల్లో గ్రహీతలకు బహుమతితో పాటు, లక్ష డాలర్లను అందజేస్తారు.

Show comments