NTV Telugu Site icon

Nobel prize: ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతులు

Nobelprizes

Nobelprizes

వైద్య విభాగంతో మొదలైన నోబెల్‌ పురస్కారాల ప్రకటన ఇంకా కొనసాగుతోంది. సోమవారం ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి రాయల్ స్వీడిస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అవార్డులను ప్రకటించింది. 2024 సంవత్సరానికి గాను ముగ్గురికి బహుమతులను అందించనుంది. దేశాల మధ్య సంపదలో అసమానతలపై పరిశోధనలకుగాను డారెన్‌ అసెమోగ్లు, సైమన్‌ జాన్సన్, జేమ్స్‌ ఎ. రాబిన్సన్‌లకు నోబెల్ బహుమతులను ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Musi River : ప్రభుత్వానికి షాక్.. హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న మూసి పరివాహక ప్రాంతాల ప్రజలు

అర్థశాస్త్రంలో ముగ్గురు ఆర్థికవేత్తల పేర్లను సోమవారం వెల్లడించారు. డారెన్‌, సైమన్‌.. అమెరికాలో కేంబ్రిడ్జ్‌లోని మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందినవారు కాగా.. రాబిన్సన్‌ షికాగో యూనివర్సిటీలో పరిశోధనలు చేస్తున్నారు. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్త ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తుంటారు. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. అవార్డు గ్రహీతలకు 11 మిలియన్ల స్వీడిష్‌ క్రోనర్‌ నగదు అందుతుంది. డిసెంబర్‌ 10న నిర్వహించే కార్యక్రమంలో గ్రహీతలకు అవార్డులను అందజేస్తారు.

ఇది కూడా చదవండి: AP Liquor Shops Lottery: లక్కంటే ఆయనదే.. మద్యం షాపుల లాటరీలో ఒకే వ్యక్తికి ఐదు దుకాణాలు!

వైద్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం మరియు శాంతికి సంబంధించి గత వారం నోబెల్ పురస్కారాలను ప్రకటించారు. ఎకనామిక్స్ బహుమతి ప్రారంభమైనప్పటి నుంచి యుఎస్ విద్యావేత్తలచే ఆధిపత్యం చెలాయించబడింది. అయితే యుఎస్ ఆధారిత పరిశోధకులు కూడా గత వారం 2024 గ్రహీతలను ప్రకటించిన శాస్త్రీయ రంగాలలో విజేతలలో ఎక్కువ మందిని కలిగి ఉన్నారు.

ఇది కూడా చదవండి: Kinnera Mogilaiah: పద్మశ్రీ మొగులయ్యకు అండగా రాచకొండ కమిషనర్.. అసలేం జరిగింది?