Site icon NTV Telugu

ర‌ష్యా-ఉక్రెయిన్ సంక్షోభం: నాటో అలా… బ్రిట‌న్ ఇలా…

ర‌ష్యా ఉక్రెయిన్ మ‌ధ్య సంబంధాలు దారుణంగా దెబ్బ‌తిన్నాయి. రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌క‌ర‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల్లో ర‌ష్యా సుమారు ల‌క్ష‌కు పైగా సైన్యాన్ని మోహ‌రించింది. ర‌ష్యా క‌నుక ఉక్రెయిన్‌పై దాడికి దిగితే క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తామ‌ని, ర‌ష్యాను అణిచివేస్తామ‌ని బ్రిట‌న్‌, అమెరికాలు చెబుతున్నాయి. అవ‌స‌ర‌మైతే నాటో ద‌ళాల‌ను పంపేందుకు సిద్దంగా ఉన్నామ‌ని బ్రిటన్ చెబుతున్నది. అయితే, త‌మ సార్వ‌భౌమాధికారానికి అడ్డువ‌స్తే ఊరుకునేది లేద‌ని, సోవియ‌ట్ యూనియ‌న్ దేశాల‌ను నాటోలో విలువైన భాగ‌స్వామ్య‌దేశంగా ఉక్రెయిన్‌ను చేర్చుకోవాల‌ని చూస్తే త‌గిన మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంద‌ని ర‌ష్యా చెబుతున్న‌ది.

Read: యూట్యూబ్ పై స్టార్ హీరోయిన్ల కన్ను

అయితే, ఉక్రెయిన్‌కు అండ‌గా నాటో ద‌ళాల‌ను పంప‌డం లేద‌ని నాటో అధికారులు చెబుతున్నారు. ఉక్రెయిన్‌కు స‌హ‌యం చేసేందుకు సిద్ధంగా ఉన్నాముగాని, బ‌ల‌గాల‌ను పంప‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది నాటో. అమెరికా, బ్రిట‌న్ చేస్తున్న వ్యాఖ్య‌లు రెచ్చ‌గొట్టే విధంగా ఉంటున్నాయ‌ని, నాటో దళాల‌ను పంపి ఉక్రెయిన్‌లో నాటోలో విలువైన భాగ‌స్వామ్య‌దేశంగా చేసుకోవాల‌ని చూస్తున్నాయ‌ని ర‌ష్యా మండిప‌డుతున్న‌ది. నాటో, అమెరికా, బ్రిట‌న్‌, ర‌ష్యా మ‌ధ్య ఉక్రెయిన్ న‌లిగిపోతున్న‌ది. చ‌ర్చ‌ల‌కు అవ‌కాశం ఉంద‌ని, ర‌ష్యా యుద్ధానికి దిగ‌బోద‌ని ఉక్రెయిన్ చెబుతున్న‌ది.

Exit mobile version