NTV Telugu Site icon

Social Media Memes: టీమిండియాను కాపాడిన నో బాల్స్.. సోషల్ మీడియాలో మీమ్స్ హల్చల్

Rahane

Rahane

Social Media Memes: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ కు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆసీస్ బౌలర్ల ధాటికి భారత బ్యాటింగ్ ఢమాలైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న గిల్, కోహ్లీ, పుజారాలు కూడా త్వరత్వరగానే పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత మిడిలార్డర్ లో వచ్చిన అజింక్యా రహానే.. లార్డ్ శార్దుల్ ఠాకూర్ ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఆసీస్ బౌలర్లు వికెట్లు తీయడాన్ని అజింక్యా రహానే అడ్డుకట్ట వేశారు. అద్భుతమైన బౌండరీలు, షాట్లతో అజింక్యా రహానే (89) పరుగులు చేశాడు. తన భాగస్వామి శార్దుల్ ఠాకూర్ (51) పరుగులు చేశాడు. దీంతో వారి మధ్య 103 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. అంతేకాకుండా స్కోరు బోర్డును ముందుకు సాగించారు. రహానే-శార్దూల్‌ జోడి భారత్‌ను తిరిగి మ్యాచ్‌లోకి తీసుకొచ్చింది.18 నెలల తర్వాత టెస్టు జట్టులోకి పునరాగమనం చేసిన అజింక్యా.. ఆస్ట్రేలియా పేసర్ల దాడికి వ్యతిరేకంగా తన ఆటతో అద్భుతమైన నైపుణ్యం, ధైర్యాన్ని కనబరిచాడు.

Read Also: Samantha: ట్రెడిషనల్ లుక్ లో సమంత ఎంత అందంగా ఉందో..

ఇదిలా ఉంచితే.. రహానే, శార్ధుల్ క్రీజులో ఉన్నప్పుడు.. కెప్టెన్ కమ్మిన్స్ వేసిన బౌలింగ్ లో శార్ధుల్ ఠాకూర్ క్యాచ్ ఇచ్చాడు. ఆ క్యాచ్ ను కామెరాన్ గ్రీన్ వదిలాడు. లంచ్ బ్రేక్ ముందు కూడా అదే కమ్మిన్స్ బౌలింగ్ లో ఠాకూర్ ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. తీరా చూస్తే.. ఎంఫైర్ నో-బాల్‌గా వెల్లడించాడు. నిన్న (గురువారం) 17 పరుగుల వద్ద రహానే ఎల్‌బిడబ్ల్యూ అయ్యాడు. అది కూడా ఆసీస్ సారథి కమిన్స్ బౌలింగ్ లోనే.. అది కూడా నో బాల్ కావడంతో ఆ తర్వాత బాల్ ను సిక్సర్ కొట్టాడు. ఇలా అజింక్యా రహానే 92 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. అయితే లక్కీగా రెండుసార్లు నో బాల్స్ కావడంతో.. రెండు వికెట్లు మిగిలి ఉన్నాయని చెప్పవచ్చు. దీంతో నో బాల్స్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి.