Donald Trump: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. వెనిజులాపై శనివారం తెల్లవారుజామున యూఎస్ దాడులు చేసింది. మదురోతో పాటు ఆయన భార్యను బంధించినట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికాకు తీసుకువచ్చిట్లు చెప్పారు. ఇదిలా ఉంటే, ఈ ఆపరేషన్ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫాక్స్ న్యూస్‌తో కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ దళాలు చేసిన ఆపరేషన్‌ను ట్రంప్ ప్రశంసించారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరుముగ్గురికి గాయాలైనప్పటికీ, ఏ అమెరికన్ కూడా ప్రాణాలు కోల్పోలేదని చెప్పారు.
Read Also: Delhi riots case: ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ బెయిల్‌పై జనవరి 5న సుప్రీంకోర్టు తీర్పు..
మదురోను పట్టుకునేందుకు నిర్వహించిన ఆపరేషన్‌ను తాను ప్రత్యక్షంగా చూశానని, ఇది ఒక ‘‘టెలివిజన్ షో’’టా ఉందని ట్రంప్ అన్నారు. ‘‘ఇలాంటి ఆపరేషన్ ఏ దేశం కూడా మరో దేశం మీద చేయలేదు. ఏం జరిగిందో మీరు చూసిఉంటే, నిజంగా ఒక టీవీ షో చూసినట్లు ఉంది. ఆ వేగం, ఆ తీవ్రత అద్భుతం. ఈ పని చేసిన వారు అద్భుతంగా చేశారు. ఇలాంటి పని మరెవ్వరూ చేయలేరు’’ అని ట్రంప్ గొప్పలు చెప్పుకున్నారు.
ఈ ఆపరేషన్ చాలా సంక్లిష్టమైందని హెలికాప్టర్లు, ఫైటర్ జెట్లతో సహా భారీ సంఖ్యలో విమానాలు పాల్గొన్నాయని చెప్పారు. ప్రతీ పరిస్థితికి ఒక ఫైటర్ జెట్ల సిద్ధంగా ఉందని, వారు లోపలకు చొచ్చుకెళ్లి, ఒక స్టీల్ తలుపులో దృఢంగా ఉన్న ప్రదేశాల్లోకి క్షణాల్లో ప్రవేశించారని అన్నారు. ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో అనేక ఆపరేషన్లు చేయించానని, కానీ ఇలాంటి దాన్ని ఎప్పుడూ చూడలేదని, ఇటీవల ఇరాన్ అణు కేంద్రాలపై ఆపరేషన్‌ను ట్రంప్ ప్రస్తావించారు. అమెరికన్ సైనికులకు ప్రాణనష్టం జరగలేదని, కొన్ని గాయాలు మాత్రమే అయ్యాయని, ఒక్క మరణం కూడా లేదని, ఇది నిజంగా అద్భుతమని ట్రంప్ అన్నారు.
