Nirav Modi To Be Extradited To India, Loses Appeal In UK Court: భారతదేశంలో బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి విదేశాల్లో ఉంటున్న నీరవ్ మోదీకి ఎదురుదెబ్బ తాకింది. ఇండియాకు రాకుండా బ్రిటన్ లో ఉంటున్న నీరవ్ మోదీని భారత్ అప్పగించాలంటూ అక్కడి కోర్టు తీర్పు చెప్పింది. మోసం, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీని భారత్ అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన వేసిన పిటిషన్ ను యూకే హైకోర్టు బుధవారం తిరస్కరించింది. నీరవ్ మోదీ అప్పగింత అన్యాయం, అణచివేత కానది కోర్టు పేర్కొంది.
Read Also: Bandi Sanjay: మోడీ తెలంగాణ పర్యటన.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
నీరవ్ మోదీని భారత్ కు అప్పగించాలని యూకే కోర్టు తీర్పు చెప్పింది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీగా లోన్లు తీసుకుని మోసం చేశాడు. అప్పటి నుంచి భారత్ కు రాకుండా విదేశాల్లో ఉంటూ తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. తనను భారత్ పంపించడాన్ని వ్యతిరేకిస్తూ నీరవ్ మోదీ బ్రిటన్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. రూ. 11,000 కోట్లకు పైగా బ్యాంకులను మోసం చేశాడు నీరవ్. గుజరాత్ కు చెందిన ఈ వజ్రాల వ్యాపారిని యూకే నుంచి ఇండియాకు తీసుకురావడానికి మన దేశం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఈ రోజు లండన్ లోని వెస్ట్ మినిస్టర్స్ కోర్టు ఆయన వేసిన పిటిషన్ ను వ్యతిరేకించింది. లార్డ్ జస్టిస్ జెరెమీ సువర్ట్ స్మిల్ , జస్టిస్ రాబర్ట్ జేలు, నీరవ్ మోదీని భారతదేశానికి అప్పగించేందుకు అనుమతిస్తూ తీర్పు వెలువరించారు.
మోడీని లండన్ నుంచి ముంబైలోని ఆర్ధర్ రోడ్ జైలుు తీసుకురావడానికి మార్గం సుగమం అయింది. నీరవ్ మోదీ లాగే అతని మేనమామ మోహుల్ చోక్సీ కూడా పీఎన్బీని మోసం చేసి ఆంటిగ్వా, బార్బుడా పౌరసత్వం తీసుకున్నాడు. భారత్ ఏజెన్సీలు ఇతడిని కూడా అప్పగించాలని కోరుతున్నాయి.
ఇదిలా ఉంటే మరో 14 రోజుల్లో హైకోర్టు ఆదేశాలను ఛాలెంజ్ చేస్తూ బ్రిటన్ సుప్రీంకోర్టును నీరవ్ మోదీ ఆశ్రయించవచ్చు. అయితే దీన్ని హైకోర్టు అంగీకరిస్తేనే బ్రిటన్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. నీరవ్ మోదీ యూరోపియన్ మానవహక్కుల న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించే అవకాశం ఉంది. ఇండియాలో నీరవ్ మోదీ కేసును ఈడీ, సీబీఐలు విచారిస్తున్నాయి. నీరవ్ మోదీ కేసులో భారత ఏజెన్సీలు బ్రిటన్ కోర్టు ముందు అన్ని ఆధారాలను సమర్పించారు.
