Site icon NTV Telugu

Nigeria jailbreak: తీవ్ర‌వాదుల దాడి.. 600 మంది ఖైదీలు ప‌రార్‌..

Nigeria Jailbreak

Nigeria Jailbreak

ఇస్లామిక్ మిలిటెంట్ వ్య‌తిరేక ముఠా నైజీరియా రాజధాని అబూజలో ఉన్న ఓ కారాగారంపై దాడులకు తెగబడ్డారు. దీంతో.. దాదాపు 600 మంది ఖైదీలు పరారయ్యారు. అయితే, వీరిలో సుమారు 300 మందిని తిరిగి పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. మంగళవారం అర్థ‌రాత్రి 10గంటల సమయంలో పక్కా ప్రణాళికతో వచ్చిన తీవ్రవాద ముఠాలు కుజీ కారాగారంపై భారీ పేలుడు పదార్థాలతో దాడికి తెగబడ్డారు. అక్క‌డ వున్న భద్రతా సిబ్బందిని హతమార్చిన దుండగులు, వారితో పాటు తీసుకు వ‌చ్చిన పేలుడు పదార్థాలతో గోడలను కూల్చి లోనికి ప్రవేశించారు. అయితే.. వీరిని బోకో హరమ్‌గా పిలుస్తార‌ని, ఇస్లామిక్‌ మిలిటెంట్‌ వ్యతిరేక ముఠాలే ఈ దాడులకు పాల్పడినట్లు నైజీరియా అంతర్గత వ్యవహారాల శాఖ కార్యదర్శి శువాయిబ్‌ బెల్గోర్‌ పేర్కొన్నారు.

read also: Bandi Sanjay : రాజ్యసభకు దక్షిణాది ప్రముఖులు.. ఆ ఘనత మోడీదే..

దానికి చెందిన‌ వారు ఎక్కువ మంది ఖైదీలుగా ఉన్నారని, వారిని విడిపించుకు వెళ్లేందుకే దుండగులు ఈ పథకం రచించారని అన్నారు. అయితే.. ఇర‌భై కోట్లకుపైగా జనాభా కలిగిన నైజీరియాలో బోకోహరం ముఠాలు జైళ్లపై దాడులకు పాల్పడడం ఇటీవలి కాలంలో ఎక్కువైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈనేప‌థ్యంలో.. నైజీరియా రాజధానిలో చోటుచేసుకోవడం మాత్రం ఇదే తొలిసారి. ఇలావుంటే.. ఈశాన్య నైజీరియాలో తీవ్రవాద ముఠాలు సృష్టిస్తోన్న నరమేధానికి ఇప్పటివరకు 35వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అయితే.. ప్రాంతాల‌లో మిలిటెంట్ల దాడుల భయాలతో దాదాపు ఇర‌వై లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లినట్లు ఐరాస గణాంకాలు చెబుతున్నాయి. అయితే.. సుదీర్ఘ కాలంగా అక్కడ నెలకొన్న అస్థిరత వల్ల ఆకలి.. ఆరోగ్య సేవలలేమితో దాదాపు మూడు లక్షలకుపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

SI Cruelty: మైనర్ బాలుడిపై వేమూరు ఎస్ఐ అరాచకం

Exit mobile version