Site icon NTV Telugu

Nicolas Maduro: ఎక్స్‌లో నికోలస్ మదురో పోస్టులు.. జైలు నుంచే చేస్తున్నారా?

Nicolas Maduro1

Nicolas Maduro1

వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో ఎక్స్ ఖాతా సడన్‌గా యాక్టివేట్ అయింది. దీంతో సోషల్ మీడియా ఖాతాదారులు ఆశ్చర్యపోయారు. ఆగస్టు 2024 తర్వాత బుధవారం తెల్లవారుజామున నికోలస్ మదురో ఎక్స్‌లో పోస్ట్ చేయడం ఇదే తొలిసారి. ‘‘కిడ్నాప్ నుంచి పదకొండు రోజులు గడిచాయి.’’ అంటూ ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం నికోలస్ మదురో అమెరికా జైల్లో ఉన్నారు. అయితే ఎక్స్‌ను మొబైల్ ఫోన్ నుంచి ఏమైనా నడిపిస్తున్నారా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

వెనిజులా అధ్యక్షుడిగా ఉన్న నికోలస్ మదురోను.. ఆయన భార్యను జనవరి 3న అమెరికా సైన్యం కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకొచ్చేశారు. అప్పటినుంచి బ్రూక్లిన్‌ జైల్లో ఉంటున్నారు. అనంతరం వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ బాధ్యతలు స్వీకరించారు. తాజాగా తానే అధ్యక్షుడి నంటూ ట్రంప్ కూడా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇక వెనిజులా చమురును అమెరికా స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది.

 

Exit mobile version