Hamas War: హమాస్ యుద్ధంలో ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. తమ లక్ష్యాలు నెరవేరే దాకా యుద్ధాన్ని ఆపేది లేదని, ఎంత ఒత్తిడి ఎదురైనా కూడా యుద్ధాన్ని కొనసాగిస్తామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇటీవల చెప్పారు. దానికి అనుగుణంగానే ఇజ్రాయిల, గాజస్ట్రిప్‌పై విరుచుకుపడుతోంది. దీంతో పాటు వెస్ట్ బ్యాంకులో కూడా దాడులు నిర్వహిస్తోంది.
ఇదిలా ఉంటే గాజాలో యుద్ధం ఇప్పుడు హమాస్ నాయకత్వంపై ఖచ్చితమైన, ఇంటెలిజెన్స్ ఆధారిత కార్యకలాపాలపై దృష్టి సారించే కొత్త దశకు పరివర్తన చెందుతోందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ శుక్రవారం అన్నారు. మరోవైపు గాజాలో ఆపరేషన్ తీవ్రతను తగ్గించాలని ఇజ్రాయిల్‌ని అమెరికా కోరింది. పౌరుల భద్రతపై శ్రద్ధ చూపాలని సూచించినట్లు సమాచారం.
Read Also: Koose Munisamy Veerappan : ఓటీటీలోకి వచ్చేసిన వీరప్పన్ బయోపిక్..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై దాడులు చేసింది. ఈ దాడుల్లో 1200 మందిని హతమార్చింది. 240 మందిని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్, హమాస్ ఉగ్రవాదులే టార్గెట్‌గా గాజాపై విరుచుకుపడుతోంది. ముందుగా ఉత్తర గాజాను టార్గెట్ చేసిన ఇజ్రాయిల్ బలగాలు ఇప్పడు దక్షిణ ప్రాంతంపై కూడా దాడులు చేస్తోంది. ఇజ్రాయిల్ దాడుల్లో ఇప్పటి వరకు 19,000 మంది పాలస్తీనా పౌరులు మరణించారు. ఇందులో చాలా మంది పిల్లలు ఉండటంతో ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.