NTV Telugu Site icon

Shark Attack: పెళ్లైన తర్వాత రోజే షార్క్ దాడిలో నవ వధువు మృతి

Shark Attack

Shark Attack

Shark Attack: పెళ్లైన తర్వాతి రోజు మృత్యువు షార్క్ రూపంలో వచ్చింది. నవ వధువుపై షార్క్ దాడి చేసి చంపేసింది. ఈ ఘటన బహామాస్‌లో జరిగింది. తన భర్తతో కలిసి 44 ఏళ్ల మహిళ సముద్రంలో పాడిల్ బోర్డింగ్ చేస్తుండగా, షార్క్ అటాక్ చేసింది. బోస్టన్‌కి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. ఆమెకు ఆదివారమే వివాహం జరిగిందని, సోమవారం బీచ్‌లో పెడల్ బోర్డింగ్ చేస్తుండగా, ఈ భయంకరమైన దాడి జరిగింది.

Read Also: Smriti Irani: భారత్‌లో సౌదీ అరేబియా మంత్రి పర్యటన.. హజ్ యాత్రపై స్మృతి ఇరానీ చర్చ

సోమవారం స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 11.15 గంటలకు యూఎస్‌కి చెందిన మహిళపై షార్క్ దాడి చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. అయితే చనిపోయిన మహిళ పేరును వెల్లడించలేదు. బహమాస్‌లోని వెస్ట్రన్ ప్రొవిడెన్స్ లోని ఒక రిసార్ట్ వెనకలా ఉన్న సముద్ర తీరం నుంచి దాదాపుగా 3-4 మైళ్ల దూరంలో సముద్రంలోవిహరిస్తుండగా.. మహిళపై దాడి జరిగిందని పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. కుడి తుంటి భాగం, కుడి అవయవాలపై తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో చనిపోయిందని వెల్లడించారు. కేబుల్ బీచ్‌లోని శాండిల్స్ రిసార్ట్ సమీపంలో ఈ దాడి జరిగింది.

బహమాస్ ప్రాంతం మొత్తం 3000 కంటే ఎక్కువ ద్వీపాలు కలిగిన దేశం. దాని ఆర్థికవ్యవస్థ ప్రధానంగా టూరిజం పైనే ఆధారపడి ఉంది. ఈ ప్రాంతం సముద్రతీరం, బీచులకు ప్రసిద్ధి. షార్కుల దాడి ఇక్కడ చాలా అరుదు. ఏడాదికి కేవలం ఐదారు ఘటనలు మాత్రమే జరుగుతుంటాయి. అయితే ఆస్ట్రేలియాలో ఎక్కువగా షార్క్ దాడులుకు గురవుతున్నారు.