Site icon NTV Telugu

Kepler Planets: నీటితో నిండిన రెండు భారీ గ్రహాలను గుర్తించిన హబుల్..

Kepler Planets

Kepler Planets

Newly discovered twin Kepler planets could be unique water worlds: ఈ అనంత విశ్వంలో భూమి లాంటి గ్రహాలు కొన్ని వేల సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. అయితే వీటన్నింటి మాత్రం మానవుడు గుర్తించలేదు. మనం ఉన్న పాలపుంత గెలాక్సీలోనే 300 బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి. అలాంటి గెలాక్సీలు మన విశ్వంలో కొన్ని బిలియన్లు ఉన్నాయి. అంటే భూమిలాంటి గ్రహాలు కొన్ని వేల సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. అయితే గత కొన్ని ఏళ్లుగా శాస్త్రవేత్తలు భూమిని పోలిన గ్రహాలను, భూమి మాదిరిగానే నీటిని కలిగి, జీవం కలిగి ఉన్న గ్రహాలను వెతుకుతున్నారు. సౌరకుటుంబం వెలువల ఇప్పటి వరకు కొన్ని కొన్ని గ్రహాలను గుర్తించారు.

Read Also: Yogi gets a Bulldozer in dowry: అల్లుడి పేరు యోగి.. బుల్డోజర్ కట్నంగా ఇచ్చిన మామ..

అయితే తాజాగా ఖగోళ శాస్త్రవేత్తలు ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. సౌరవ్యవస్థకు అవతల ఉన్న రెండు కొత్త గ్రహాలను కనుక్కున్నారు. అయితే ఈ రెండు కూడా భారీగా నీటితో నిండి ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మరుగుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతున్న వీటని హబుల్ టెలిస్కోప్ తో గుర్తించారు. భూమికి 218 కాంతి సంవత్సరాల దూరంలో లైరా రాశిలో కెప్లర్-138c, కెప్లర్-138d గ్రహాలను కనుక్కున్నారు. భూమి కన్నా ఒకటిన్నర రెట్లు పరిమాణంలో పెద్దగావి ఉన్న ఈ రెండు గ్రహాలు దాని మాతృనక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయి. ఈ రెండు గ్రహాల్లో సగం పరిమాణంలో నీరు ఉండే అవకాశం ఉందని అంచానా వేస్తున్నారు. భూమితో పోలిస్తే ఈ రెండు గ్రహాలు ద్రవ్యరాశిలో రెండు రెట్లు అధికంగా ఉండటంతో పాటు భూమి సాంద్రతతో పోలిస్తే తక్కవ సాంద్రతను కలిగి ఉన్నట్లు అంచానా వేస్తున్నారు.

Exit mobile version