New York: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచంలోని పలు దేశాలు అమలు చేస్తున్నాయి. భారతీయ సంస్కృతిలో భాగమైన దేవాలయాలు ఇప్పటికే కొన్ని దేశాల్లో నిర్మించారు. అలాగే విదేశాల్లో భారతీయ సంతతికి చెందిన వారు ఎక్కువగా ఉంటున్న ప్రాంతాల్లో భారతీయ పండుగలను సైతం జరుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం అమెరికాలో దీపావళి పండుగకు సెలవు ఇవ్వాలని కామన్స్ సభలో ప్రైవేటు తీర్మానం ప్రవేశ పెట్టారు. త్వరలోనే దీనిపై నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే దీపావళి నాటికి అనుకూలమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉందంటున్నారు. ఇపుడు న్యూయార్క్ లో సైతం దీపావళి పండుగకు స్కూల్స్ కు సెలవు ఇస్తున్నట్టు మేయర్ ప్రకటించారు.
Read also: TS Congress: స్ట్రాటజీ మీట్‌కు15 మందికి మాత్రమే పిలుపు.. సీనియర్ల అసంతృప్తి..!!
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భారతీయులు దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే దీపావళి పండుగకు న్యూయార్క్ లో సైతం ప్రాధాన్యత కల్పించబడింది. విదేశాల్లో ఉన్న తెలుగువాళ్లు సైతం ఈ పండుగను ఏటా ఎంతో సందడిగా జరుపుకుంటారు. హిందువులు ఘనంగా జరుపుకునే దీపావళి పండుగకు న్యూయార్క్ మేయర్ ప్రాధాన్యత కల్పించారు. దీపావళి పర్వదినాన న్యూయార్క్‌లో పాఠశాలలకు సెలవుదినంగా ప్రకటించారు.
Read also: Red Banana: రెడ్ బనానా సాగులో పాటించాల్సిన మెళుకువలు..!
న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ సోమవారం ప్రకటన విడుదల చేశారు. దీపావళి రోజున స్కూళ్లకు సెలవు ప్రకటించే చట్టంలో తాను భాగమైనందుకు గర్విస్తున్నట్లు చెప్పారు. దీపావళి పర్వదినాన స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సాగిన పోరాటం అసెంబ్లీ మెంబర్ జెనిఫర్ రాజ్‌కుమార్.. సంఘం నాయకులకు అండగా నిలిచినందుకు గర్వపడుతున్నానని తెలిపారు. ఈ ప్రకటనతో దీపావళి ముందుగానే వచ్చినట్లయ్యిందని మేయర్ ఎరిక్ అన్నారు. న్యూయార్క్ నగరంలోని స్కూళ్లకు దీపావళి రోజున సెలవు ఇవ్వాల్సిందేనంటూ న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెనిఫెర్ రాజ్‌కుమార్ చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. రెండు దశాబ్దాల తన పోరాటం తర్వాత ఈ విషయంలో విజయం సాధించినందుకు ఆనందంగా ఉందని జెనిఫెర్ రాజ్‌కుమార్ తెలిపారు.
