అమెరికా అధ్యక్షుడు ట్రంప్-న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ మధ్య నిన్నామొన్నటి దాకా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా ఉండేది. న్యూయార్క్ మేయర్ ఎన్నికల ముందు ఓ రేంజ్‌లో ట్రంప్ విరుచుకుపడ్డారు. మమ్దానీని నోటికొచ్చినట్లు మాట్లాడారు. అంతే రీవర్స్‌లో మమ్దానీ కూడా కౌంటర్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం పరిణామాలు మారినట్లుగా తెలుస్తోంది.
ఇది కూాడా చదవండి: Delhi Car Blast: వామ్మో.. ఉగ్రవాదులు ఒళ్లు గగుర్పొడిచే ప్లాన్.. వెలుగులోకి కొత్త ప్రణాళిక!
తాజాగా మమ్దానీ.. ట్రంప్ అపాయింట్‌మెంట్ కోరారు. ఈ విషయాన్ని ట్రంప్ కూడా ధృవీకరించారు. మమ్దానీ అపాయింట్‌మెంట్ కోరారని.. వైట్‌హౌస్‌లో సమావేశానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ‘‘న్యూయార్క్ మేయర్ మాతో కలవాలనుకుంటున్నారు. మేము ఏదైనా చేస్తాము.’’ అంటూ ట్రంప్ పేర్కొన్నారు. మొత్తానికి నెలల తరబడి వైరం తర్వాత ట్రంప్-మమ్దానీ మధ్య స్వరంగా మారినట్లుగా కనిపిస్తోంది.
ఇది కూాడా చదవండి: Lowest Temperature: వణికిస్తున్న ‘చలి పులి’.. 5 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు..
న్యూయార్క్ అభివృద్ధి కోసం ఎవరినైనా కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మమ్దానీ తెలిపారు. తన బృందం ఇప్పటికే వైట్‌హౌస్‌ను సంప్రదించారని చెప్పారు. న్యూయార్క్ ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి వాషింగ్టన్ వెళ్తానని పేర్కొన్నారు. ఇటీవల షట్‌డౌన్ కారణంగా న్యూయార్క్ ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. పైగా న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దానీ అనేక ఉచిత హామీలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ను కలిసేందుకు మమ్దానీ మక్కువ చూపిస్తున్నారు. అలాగే ట్రంప్ కూడా మమ్దానీని కలిసేందుకు ఇష్టపడుతున్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి.
ఆదివారం ట్రంప్ మాట్లాడుతూ.. సామరస్యపూర్వక సర్వా్న్ని వినిపించారు. న్యూయార్క్‌లో ప్రతిదీ బాగా జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సోమవారం కూడా ఇదే స్వరాన్ని వినిపించారు. అయితే ట్రంప్-మమ్దానీ సమావేశం తేదీ ఇంకా నిర్ణయించబడలేదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు.
