Site icon NTV Telugu

US: న్యూయార్క్ గవర్నర్ సంచలన ప్రకటన.. మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీకి మద్దతిస్తున్నట్లు వెల్లడి

Us

Us

న్యూయార్క్ డెమొక్రాటిక్ మేయర్ అభ్యర్థిగా జోహ్రాన్ మమ్దానీని ఎన్నికయ్యారు. ఈ నిర్ణయాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. ముస్లిం వ్యక్తిని మేయర్ అభ్యర్థిగా ఎలా ఎంపిక చేస్తారంటూ డెమొక్రాటిక్ పార్టీపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా డెమొక్రాటిక్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీకి న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ మద్దతు తెలిపారు. ఆర్థిక విధానంలో మమ్దానీ తీరును ప్రసంశించారు.

మమ్దానీ(33) ఉగాండాలో జన్మించారు. మాన్‌హట్టన్‌లో పెరిగారు. జూన్‌లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా మమ్దానీ గెలిచి అందరినీ ఆశ్చర్య పరిచారు. అయితే తొలిసారి ఒక ముస్లిం వ్యక్తి మేయర్ అభ్యర్థిగా ఎన్నిక కావడం ఆశ్చర్యపరిచింది. అయితే ఈ ఎంపికను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. డెమోక్రటిక్ పార్టీపై మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో మమ్దానీని గెలవనివ్వం అన్నారు. తాజాగా బఫెలోకు చెందిన 67 ఏళ్ల న్యూయార్క్ గవర్నర్ హోచుల్ కూడా మమ్దానీకి మద్దతుగా నిలిచారు.

ఇది కూడా చదవండి: TG Rains: హైదరాబాద్ ను వణికించిన వాన.. అఫ్జల్ సాగర్ నాలాలో పడి కొట్టుకుపోయిన మామ అల్లుడు

మమ్దానీకి ఓటు వేయాలని గవర్నర్ కాథీ హోచుల్ న్యూయార్క్ వాసులను కోరింది. కొన్ని విషయాల్లో మమ్దానీని వ్యతిరేకించినా.. ఆర్థిక విషయాల్లో సంక్షోభాన్ని పరిష్కరించడంలో మమ్దానీ సమర్థుడు అని తెలిపారు. న్యూయార్క్ పట్ల నిబద్దత కలిగిన వ్యక్తి అని కొనియాడారు. న్యూయార్క్ నగరాన్ని ఉన్నతంగా తీర్చగల సమర్థుడు అని ప్రశంసించారు.

ఇది కూడా చదవండి: IND vs PAK: ఈ విజయం పహల్గాం ఉగ్రదాడి బాధితులు, సాయుధ బలగాలకు అంకితం!

Exit mobile version