Site icon NTV Telugu

Earthquake: న్యూయార్క్-న్యూజెర్సీలో భూకంపం.. 4.8 తీవ్రత నమోదు..

Newyork

Newyork

Earthquake: అమెరికాలో భూకంపం సంభవించింది. న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాలు భూకంపానికి ప్రభావితమయ్యాయి. న్యూజెర్సీలో శుక్రవారం 4.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో ఉద్భవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది.

Read Also: Kangana Ranaut: దుమారం రేపుతున్న సుభాష్ చంద్రబోస్‌పై వ్యాఖ్యలు

న్యూయార్క్ నగరంలో భూకంపం తాలూకూ ప్రకంపనలు కనిపించాయి. భూకంప కేంద్రం న్యూజెర్సీలోని వైట్‌హౌస్ స్టేషన్‌కి సమీపంలో ఉంది. భూకంపం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లిన సమాచారం అందలేదు. న్యూయార్క్ నగరం, న్యూజెర్సీ, ఉత్తర పెన్సిల్వేనియా, పశ్చిమ కనెక్టికట్‌లతో దీని ప్రభావం కనిపించింది. భూకంపం వల్ల న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి భద్రత మండలి సమావేశానికి అంతరాయం ఏర్పడింది. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం కారణంగా గాజాలో పరిస్థితులపై చర్చ జరుగుతుండగా ప్రకంపనలు వచ్చాయి.

Exit mobile version