NTV Telugu Site icon

Pig kidney transplant: పంది కిడ్నీ మార్పిడి, మెకానికల్ గుండె కలిగిన తొలి మహిళ మృతి..

Pig Kidney Transplant

Pig Kidney Transplant

Pig kidney transplant: కిడ్నీ ఫెయిల్యూర్ వ్యక్తులు జీవితాంతం డయాలసిస్ ప్రక్రియ లేదా ఇతరులు కిడ్నీ ఇవ్వడం వల్లే తమ మిగిలిన జీవితాన్ని పొందుతున్నారు. అయితే, ఇటీవల శాస్త్రవేత్తలు, వైద్యులు పలువురికి ‘పంది కిడ్నీ’ని అమర్చారు. అయితే, కొన్ని రోజుల పాటు ఇది పనిచేసినప్పటికీ తర్వాత శరీరం చేత తిరస్కరించబడటమో లేక ఇతర ఆరోగ్య కారణాల వల్లనో మరణించారు. అయితే, దీనిపై మరింత పరిశోధనలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జన్యుపరంగా పంది కిడ్నీలో మార్పులు చేసి పూర్తి స్థాయిలో మనుషులకు అందుబాటులోకి తీసుకురావడానికి పరిశోధనలు సాగుతున్నాయి.

ఇదిలా ఉంటే తొలిసారి పంది కిడ్నీని మార్పిడి జరిగిన, మెకానికల్ గుండె కలిగిని న్యూజెర్సీకి చెందిన 54 ఏళ్ల మహిళ మరణించింది. ఏప్రిల్ నెలలో ఈ రెండింటిని విజయవంతంగా చేయించుకున్న లిసా పిసానో, మొదటగా అనారోగ్యం నుంచి కోలుకుంటున్నట్లు కనిపించింది. అయితే, ఆమె అనూహ్యంగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం మరణించినట్లు ఆమె సర్జన్ ప్రకటించారు.

Read Also: Vizag Steel Plant: విశాఖకు కేంద్ర ఉక్కు మంత్రి.. స్టీల్‌ ప్లాంట్‌ వర్గాల్లో ఉత్కంఠ..

ఆమె గుండెకు ఇచ్చిన మందుల వల్ల పంది కిడ్నీ డ్యామేజ్ కావడంతో, సర్జరీ జరిగిన 47 రోజుల తర్వాత వైద్యులు ఆ కిడ్నీని తొలగించారు. పిసానోకు తిరిగి డయాలసిస్ ద్వారా చికిత్స అందించడం ప్రారంభించారు. హార్ట్ పంప్‌ని వైద్యులు కొనసాగించారు. భవిష్యత్తులో మరో వ్యక్తి జీవించడానికి, చనిపోవాల్సిన అవసరం లేకుండా లిసా మాకు సాయం చేసిందని ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ రాబర్ట్ మోంట్‌గోమెరీ అన్నారు.

న్యూజెర్సీకి చెందిన పిసానో, న్యూ యార్క్‌లోని ఒక ఆసుపత్రిలో జన్యుపరంగా సవరించిన పంది కిడ్నీ, హార్ట్ పంప్‌ను అమర్చుకున్నారు. చివరి దశ కిడ్నీ వ్యాధి, గుండె వైఫల్యం కారణంగా వీటిని వైద్యులు ఆమెకు అమర్చారు. ప్రమాదం అని తెలిసినా ఆమె తన భర్త, కుటుంబంతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. పిసానో జన్యపరంగా మార్పు చేసిన పంది కిడ్నీని పొందిన రెండో వ్యక్తి. మొదటి వ్యక్తి రిచర్డ్ స్లేమాన్. స్లేమాన్ సర్జరీ జరిగిన రెండు నెలల తర్వాత మరణించారు.