బ్రిటన్‌లో కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నది. ఇటీవలే ఆంక్షలను సడలించారు. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు బయటకు వస్తున్నారు. అంతేకాదు, మస్క్ లేకుండా బయట తిరుగుతున్నారు. దీంతో మళ్లీ కరోనా భయం పట్టుకున్నది. ఒకవైపు డెల్టా వేరియంట్ విజృంభిస్తుంటే, మరోవైపు కొత్త వేరియంట్ భయం పట్టుకున్నది. బ్రిటన్‌లో తాజాగా బి.1.621 రకం వేరియంట్‌ను గుర్తించారు. 16 మందిలో ఈ కొత్త వేరియంట్ బయటపడింది. ఈ 16 కేసులు లండన్‌లో బయటపడ్డాయి.
Read: తిండి ధ్యాసలో ఫ్లైట్ మిస్ చేసుకున్న తమన్నా
ప్రస్తుతం ఈ వేరియంట్ పై పరిశోధకులు పరిశోధనలు చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రయాణాల వలన ఈ కేసులు వచ్చి ఉండోచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేరియంట్ వ్యాప్తి ఎలా ఉంది, సామూహిక వ్యాప్తి చెందుతుందా అనే విషయాలపై స్పష్టమైన సమాచారం లేదని, త్వరలోనే పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుందని బ్రిటన్ ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అయితే, ఈ బి.1.621 రకం వేరియంట్ మొదట జనవరిలో కొలంబియాలో గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపింది. ఈ వేరియంట్‌కు చెందున కేసులు అమెరికాలో 592, పోర్చుగల్‌లో 56, స్వట్జర్లాండ్‌లో 41, జపాన్‌లో 47 కేసులు ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలియజేసింది.
