NTV Telugu Site icon

China: చైనాలో వెలుగులోకి 8 రకాల కొత్త వైరస్‌లు.. మరో మహమ్మారిపై ఆందోళన..

New Virus

New Virus

China: 2019 మొదలైన కరోనా వైరస్ ఇప్పటికీ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ఆల్పా, బీటా, ఓమిక్రాన్ అంటూ ఇలా తన రూపాన్ని మార్చుకుని మనుషులపై దాడి చేస్తోంది. తొలిసారిగా ఈ వైరస్ చైనా నగరమైన వూహాన్ లో బయటపడింది. ఆ తర్వాత నెమ్మదిగి ప్రపంచం అంతటా వ్యాపించింది. ప్రస్తుతం కోవిడ్-19కి వ్యాక్సిన్ కనుగొన్నా కూడా అడపాదడపా ఇది తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది.

Read Also: Tamil Nadu: గవర్నర్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి.. డీఎంకేపై బీజేపీ విమర్శలు..

ఇదిలా ఉంటే చైనాలోని దక్షిణ తీరంలో ఉన్న ఉష్ణమండల ద్వీపమైన హైనాన్ లో మునుపెన్నడూ చూడని కొత్తగా 8 రకాల వైరస్‌లను చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎలుకల్లో వీటిని గుర్తించారు. ఎప్పుడైనా ఇవి ఎలుకను దాటి విస్తరిస్తే మానవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ వైరస్‌లు మరో మహమ్మారి ముప్పుపై ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే భవిష్యత్ మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రపంచాన్ని సిద్ధం చేసే పనిలో పరిశోధకులు ఈ ఆవిష్కరణ చేశారు.

హైనాన్ లో ఎలుకల నుంచి దాదాపుగా 700 నమూనాలను శాస్త్రేవత్తలు సేకరించారు. 8 కొత్త వైరస్ లను ఇందులో కనుగొన్నారు. ఇందులో ఒకటి SARS-CoV-2, COVID-19కి కారణమైన వైరస్ కుటుంబానికి చెందింది. గబ్బిలాల్లోని వైరస్‌లపై అనేక పరిశోధనలు చేసిన ‘బ్యాట్ ఉమెన్’గా పేరు తెచ్చుకున్న శాస్త్రవేత్త డాక్టర్ షి జెంగ్లీ ఈ వివరాలను వైరోలాజికా సినికా జర్నర్ లో ప్రచురించారు. ఈ వైరస్ లు మానవులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు చేయాల్ని ఆమె పిలుపునిచ్చారు.

వైరోలాజికా సినికా అనే పత్రిక చైనీస్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ(సీఎస్ఎం) యొక్క ప్రచురణ విభాగం. ఇది చైనా ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఎఫైర్స్ కింద పనిచేస్తుంది. కొత్త అధ్యయనంలో 201-2021 మధ్య హైనాన్ లో పట్టుకున్న ఎలుకల గొంతు నుంచి 682 నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను ఎలుకల జాతులు, అవి ఉంటే ద్వీపాల ఆధారంగా వర్గీకరించారు. వీటిని పరీక్షిస్తే CoV-HMU-1 అని పిలిచే ఒక కొత్త కరోనావైరస్‌తో సహా కొత్త నోవల్ వైరసెస్ వెలుగులోకి వచ్చాయి. వీటిలో కొన్ని మానవుడి ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే అవకాశం కూడా ఉంది.