సౌదీ అరేబియాలోని ఓ లావా గుహను 2007 వ సంవత్సరంలో పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగోన్నారు. అయితే, ఆ గుహలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వివిధ రకాల జంతువుల అరుపులు వినిపించడంతో ఆ ప్రయత్నాన్ని శాస్త్రవేత్తలు విరమించుకున్నారు. కాగా, ఇటీవలే ఆ గుహలోకి శాస్త్రవేత్తలు సురక్షింతంగా వెళ్లగలిగారు. అలా గుహలోపలికి వెళ్లిన శాస్త్రవేత్తలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. గుహమొత్తం ఎముకలతోనే నిండిపోయింది. గుహలో మొత్తం 40 రకాల జంతువులకు సంబందించిన ఎముకలు బయటపడ్డాయి.
Read: ఈ నెల 16 నుంచి ఏపీలో స్కూళ్లు రీ-ఓపెన్…
ఇందులో జంతువులతో పాటుగా మనుషుల ఎముకలు కూడా బయటపడటంతో ఆ గుహలో హైనాలు నివశించేవని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. హైనాలు సర్వభక్షక జీవులు. హైనాలు ఇవి జంతువులను వేటాడి ఈ గుహలోకి తీసుకొచ్చి ఆహారంగా తీసుకొని ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిశోధనల కోసం గుహ నుంచి దాదాపుగా 1917 రకాల ఎముకలను సేకరించారు. 13 శాంపిల్స్‌ను కార్బన్ డేటింగ్ టెస్ట్ చేయగా ఆ ఎముకలు 6,839 సంవత్సరాల నాటివిగా తేలింది. దీంతో ఆ గుహలోని మిగతా ఎముకలపై కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
