Site icon NTV Telugu

Pakistan: నేను అధికారంలో ఉంటే జీ20ని నిర్వహించే వాడ్ని.. నవాజ్ నీకు అంత సీనుందా..?

Nawaz Sharif

Nawaz Sharif

Pakistan: భారత్ జీ20 సదస్సును నిర్వహించిన తీరు పాకిస్తాన్‌కి ముఖ్యంగా అక్కడి రాజకీయ పార్టీలు, సైన్యానికి అసూయను కలిగిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రవాసంలో ఉన్న పాకిస్తాన్ పీఎంఎల్-ఎన్ పార్టీ అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జీ20 సదస్సుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తానను పదవీ నుంచి దించేయకుంటే భారత్ జీ20కి ఆతిథ్యం ఇచ్చిన విధంగా పాకిస్తాన్ కూడా అలాంటి సమావేశాలను నిర్వహించేదని వ్యాఖ్యానించారు.

Read Also: North Korea: రష్యా పర్యటనలో కిమ్.. క్షిపణుల ప్రయోగంలో నార్త్ కొరియా

సోమవారం ఆయన మాట్లాడుతూ.. 2017లో తనను పదవి నుంచి దించేయకుంటే దేశ భవిష్యత్తు మరో విధంగా ఉండేదని లండన్ లో ప్రవాసంలో గడుపుతున్న నవాజ్ షరీఫ్ అన్నారు. వరసగా మూడు సార్లు పాక్ ప్రధానిగా చేసిన నవాజ్ షరీఫ్ పేరు పనామా పేపర్స్ లీక్ లో రావడంలో ఆయన్ను ప్రధానిగా సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసింది. దీంతో 2018 జీవితకాలం ప్రభుత్వ పదవిని నిర్వహించడానికి అనర్హుడయ్యాడు. 2019లో చికిత్స కోసం లండన్ వెళ్లిన నవాజ్ అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు. 2019లో ఆయనకు అల్-అజీజియా కేసులో 7 ఏళ్ల జైలు శిక్షను లాహోర్ కోర్టు విధించింది.

ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానంతో గద్దె దించిన తర్వాత నవాజ్ షరీఫ్ తమ్ముడు షెహబాజ్ షరీఫ్ ప్రధాని అయ్యాడు. దీంతో పాకిస్తాన్ లో పరిస్థితులు మారిపోయాయి. నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ వచ్చి మరోసారి ప్రధాని కావాలనే ఆసక్తితో ఉన్నారు. దీనికి సైన్యం మద్దతు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పీఎంఎల్-ఎన్ పార్టీ విజయం సాధిస్తే తన అన్న నవాజ్ షరీఫ్ ప్రధాని అవుతారని షెహబాజ్ అంటున్నారు. దేశాన్ని అణుసామర్థ్యం వైపు తీసుకెళ్లిన ఘటన నవాజ్ షరీఫ్ దే అని, అతను పాకిస్తాన్ వస్తే ఘనంగా స్వాగతిస్తామని షహబాజ్ చెబుతున్నారు. జీవితకాల అనర్హత చట్టాన్ని పార్లమెంట్ ఇటీవల మార్చింది. దీంతో నవాజ్ షరీఫ్ పునారగమనం సులువైంది. అక్టోబర్ 21న స్వదేశం పాకిస్తాన్ వచ్చేందుకు పెద్ద షరీఫ్ సిద్దమయ్యారు.

Exit mobile version