Site icon NTV Telugu

US: కాలిఫోర్నియోలో కూలిపోయిన నేవీ ఎఫ్-35 ఫైటర్ జెట్

Us

Us

కాలిఫోర్నియాలోని నావల్ ఎయిర్ స్టేషన్ సమీపంలో ఎఫ్‌-35 ఫైటర్ జెట్ కుప్పకూలిపోయింది. వెంటనే పెద్ద ఎత్తున మంటలు అంటుకుని దట్టంగా పొగలు అలుముకున్నాయి. అయితే పైలట్ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. శిక్షణ పొందుతుండగా విమానం కూలిపోయిందని.. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో దారుణం.. బర్త్‌డే జరుపుకుంటున్న వ్యక్తిని కత్తితో పొడిచి హత్య

ఎఫ్-35 అనేది సింగిల్ సీటు సామర్థ్యం గలది. సింగిల్ ఇంజన్ మాత్రమే ఉంటుంది. సెంట్రల్ కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో నగరానికి నైరుతి దిశలో 40 మైళ్ళు (64 కిలోమీటర్లు) దూరంలో ఉన్న లీమోర్ నావల్ ఎయిర్ స్టేషన్ సమీపంలో ఫైటర్ జెట్ కూలిపోయిందని నేవీ తెలిపింది. పైలట్ సురక్షితంగా బయటపడ్డాడని.. హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. స్థానిక సమయం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు ఈ సంఘటన జరిగిందని.. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని నేవీ ప్రకటనలో తెలిపింది.

ఇది కూడా చదవండి: Himanshi Narwal: ఆపరేషన్ మహాదేవ్‌పై స్పందించిన వినయ్ నర్వాల్ సతీమణి

 

Exit mobile version