NASA: సౌరకుటుంబంలో అనేక గ్రహశకలాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. చాలా వరకు గ్రహశకలాలు ఆస్ట్రాయిడ్ బెల్ట్ లోనే ఉంటాయి. కొన్ని సార్లు మాత్రం వీటి నుంచి బయటపడి సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. అయితే అలాంటి ఓ గ్రహ శకలాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా గుర్తించింది. అయితే తాజాగా కనుగొన్న గ్రహశకలం మాత్రం విచిత్రమైన ఆకారంలో ఉంది. ఓ పెద్ద భవనం మాదిరిగా ఉంది. దీని పొడవు 1600 అడుగులు కాగా.. వెడల్పు 500 అడుగులు ఉన్నట్లు, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పోలుస్తున్నారు శాస్త్రవేత్తలు.
Read Also: Sanjay Raut: ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు, ఎంపీకి రూ. 100 కోట్లు.. మొత్తంగా రూ.2000 కోట్ల డీల్ ఇది..
ఈ గ్రహ శకలం ‘2011 AG5’ ఇటీవల ఫిబ్రవరి 3న భూమికి 1.1 మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లింది. 2011లో ఈ గ్రహశకలాన్ని కనుగొన్నప్పటికీ దీనికి సంబంధించి ఖచ్చితమైన కొలతలు, దాని ఉపరితలం వంటి వివరాలు తెలియలేదు. అయితే ప్రస్తుతం కాలిఫోర్నియాలోని బార్‌స్టో సమీపంలోని డీప్ స్పేస్ నెట్‌వర్క్ వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన 70 మీటర్ల వెడల్పైన గోల్డ్‌స్టోన్ సోలార్ సిస్టమ్ రాడార్ యాంటెన్నా డిష్ ఈ పొడవైన గ్రహశకలం కొలతలను వెల్లడించింది.
ఇప్పటివరకు ప్లానెటరీ రాడార్ పరిశీలించిన, భూమికి సమీపంలో ఉన్న 1040 ఖగోళ వస్తువుల్లో ఈ 2011 AG5 నే అత్యంత పొడవైనదిగా శాస్త్రవేత్తలు వెల్లడించారు. గ్రహశకలం 2011 AG5 ప్రతి 621 రోజులకు ఒకసారి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. 2040లో మరోసారి భూమికి సమీపంలోకి వస్తుంది. ఆ సమయంలో కూడా భూమి నుంచి సురక్షిత దూరం 6,70,000 మైళ్ల దూరం నుంచి ప్రయాణిస్తుంది.