NTV Telugu Site icon

Sunita Williams: స్పేస్ నుంచి సునీతా విలియమ్స్ రెస్క్యూ మరోసారి వాయిదా.. కారణం ఏంటి..?

Nasa.

Nasa.

Sunita Williams: అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ భూమికి తీసుకువచ్చే రెస్క్యూ మిషన్ మరోసారి వాయిదా పడింది. గతేడాది జూన్ 5న ఫ్లోరిడా నుంచి బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా ఆమె ‘‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)’’ వెళ్లారు. అయితే, స్టార్‌లైనర్ ప్రొపల్షన్ సిస్టమ్‌లో సమస్యలు ఏర్పడటం, థ్రస్టర్లు విఫలమవ్వడంతో ఆమె అక్కడే ఉండిపోయారు. సునీతా విలియమ్స్‌తో పాటు బుల్ విల్మోర్ కూడా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు.

Read Also: Brahma Anandam: ఓటీటీలో ‘బ్రహ్మా ఆనందం’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

అయితే, వీరిద్దరిని భూమిపైకి తీసుకురావడానికి ఉద్దేశించబడిన నాసా-స్పేస్ ఎక్స్ మిషన్ చివరి నిమిషంలో వాయిదా పడింది. అమెరికా ఫ్లోరిడా నుంచి ఫాల్కన్ -9 రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేసింది. లిఫ్ట్ ఆఫ్ అవ్వడానికి గంట కన్నా తక్కువ సమయం ఉన్నప్పుడు ప్రయోగం వాయిదా పడింది. నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ కాంప్లెక్స్ 39A వద్ద ఫాల్కన్ 9 రాకెట్ కోసం గ్రౌండ్ సపోర్ట్ క్లాంప్ ఆర్మ్‌లో హైడ్రాలిక్ సిస్టమ్ సమస్య కారణంగా ఐఎస్ఎస్‌కి వెళ్లాల్సిన క్రూ-10 ప్రయోగాన్ని ఈ రోజు వాయిదా వేశారు.

మళ్లీ క్రూ-10 మళ్లీ తిరిగి వచ్చే సమయంలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు భూమికి తిరిగి వస్తారు. మార్చి 14, శుక్రవారం సాయంత్రం 7:03 EDT (IST ఉదయం 4:33) గంటలకు ముందుగా ప్రయోగించాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. మిషన్ మేనేజర్లు సమావేశం తర్వాత, రాకెట్ ప్రయాణించే మార్గంలో బలమైన గాలులు, అవపాతం అంచనా వేసిన తర్వాత ప్రయోగాన్ని నిలిపేయాలని నిర్ణయించుకున్నారు. ప్రయోగ సమయంలో రాకెట్‌లో ఉన్న నాసా వ్యోమగాములు అన్నే మెక్‌క్లెయిన్ , నికోల్ అయర్స్, JAXA (జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ) వ్యోమగామి టకుయా ఒనిషి, రోస్కోస్మోస్ వ్యోమగామి కిరిల్ పెస్కోవ్ డ్రాగన్ అంతరిక్ష నౌక నుండి సురక్షితంగా నిష్క్రమించారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే మార్చి 19 నాటికి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి వచ్చే వారు.