NASA Artemis 1 Launch: చంద్రుడిపైకి వ్యోమనౌకలను పంపేందుకు నాసా చేపట్టిన ఆర్టెమిస్-1 ప్రయోగం ఇవాళ జరగనుంది. నేడు మధ్యాహ్నం 2.17 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనున్నట్లు నాసా ప్రకటించింది. సోమవారమే జరగాల్సిన ఈ ప్రయోగం ఇంధన ట్యాంకులో సమస్య కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సమస్యలను సరిచేసి రాకెట్‌ను ప్రయోగానికి సిద్ధం చేశారు. నాసా ఇప్పటి వరకు నిర్మించిన అత్యంత శక్తిమంతమైన రాకెట్ ఇదే కావడం విశేషం. ప్రారంభించిన మొదటి ప్రయోగాన్ని ఇంజిన్ ఇబ్బందులతో నిలిపివేసిన తర్వాత నాసా శనివారం తన శక్తివంతమైన తదుపరి తరం చంద్ర రాకెట్‌ను ప్రయోగించడానికి రెండవ ప్రయత్నం చేస్తోంది. ఈ సారి మానవరహిత ఓరియన్ స్పేస్ క్యాప్సుల్‌ను రాకెట్‌తో పాటు అంతరిక్షంలోకి పంపనున్నారు.
50 ఏళ్ల తర్వాత చంద్రునిపై మళ్లీ మనుషులు కాలుమోపేందుకు నాసా ప్రతిష్ఠాత్మకంగా ఆర్టెమిస్ ప్రాజెక్టును చేపట్టింది. సోమవారం ప్రయోగానికి మొత్తం సిద్ధం చేశాక.. ప్రధాన ఇంజిన్లు పనిచేయడానికి అవసరమైన ప్రీలాంఛ్ ఉష్ణోగ్రతను అందుకోవడంలో విఫలం అయ్యాయి. దీంతో ప్రయోగాన్ని చివరి నిమిషంలో నిలిపివేశారు. దీనిపై నాసా ఆర్టెమిస్ లాంఛ్ డైరెక్టర్ ఛార్లీ బ్లాక్‌వెల్ థాంప్సన్ మాట్లాడుతూ ఈ సారి ఇంజిన్ల కూలింగ్ ప్రక్రియ లాంఛ్ కౌంట్‌డౌన్‌కు 30 నిమిషాల ముందే మొదలు పెడతామని పేర్కొన్నారు. చంద్రుడిపై మనిషి కాలుపెట్టి అర్ధశతాబ్దం దాటింది.
Afghanistan: అఫ్గాన్ మసీదులో ఆత్మాహుతి దాడి.. 18 మంది మృతి
తొలిసారిగా 1969లో అమెరికాకు చెందిన వ్యోమగామి నీల్‌ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై కాలు మోపారు. 1969 నుంచి 1972 వరకు అపోలో మిషన్ ద్వారా 24 మంది వ్యోమగాములను నాసా చంద్రుడి వద్దకు పంపింది. వీరిలో 12 మంది చంద్రునిపై కాలుమోపారు. ఆ తర్వాత ఎవ్వరు కూడా జాబిల్లిపై అడుగుపెట్టలేదు. చంద్రుడి మీదకు చివరిసారిగా మనుషులు వెళ్లి వచ్చిన నాసా అపోలో 17 మిషన్‌కు ఈ ఏడాది డిసెంబర్‌లో 50 ఏళ్లు పూర్తవుతాయి. 50 ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడు చంద్రుడి మీదకు మళ్లీ మనుషులను పంపించటానికి నాసా శ్రీకారం చుడుతోంది. ఈసారి మూన్ మిషన్‌కు ‘ఆర్టిమిస్ ప్రోగ్రామ్’ అని నాసా పేరు పెట్టింది. ఈ ఆర్టిమిస్ ప్రయోగాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపడతామని నాసా కొన్నేళ్ల కిందటే ప్రకటించింది. చంద్రుడి మీదకు నాసా సిద్ధం చేసిన ఆర్టెమిస్-1ను నేడు ప్రయోగించనున్నారు.