NTV Telugu Site icon

Artemis 2: చంద్రుడి పైకి వెళ్లబోయేది వీరే.. పేర్లు వెల్లడించిన నాసా..

Artemis 2

Artemis 2

Artemis 2:అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్టెమిస్ 2 మూన్ మిషన్ చేపట్టబోతోంది. దాదాపుగా 50 ఏళ్ల తరువాత తొలిసారిగా మానవుడు మరోసారి చంద్రుడి వద్దకు వెళ్లబోతున్నాడు. తాజాగా సోమవారం ఈ మూన్ మిషన్ కు సంబంధించి వ్యోమగాముల పేర్లను వెల్లడించింది నాసా. నలుగురు వ్యోమగాములను ఎంపిక చేశారు. ఆర్టెమిస్ 2 వ్యోమనౌక ద్వారా జెరెమీ హాన్సెస్, రీడ్ వైజ్ మన్, క్రిస్టినా కోచ్, విక్టర్ గ్లోవర్ లు చంద్రుడి పైకి వెళ్లనున్నారు.

తొలిసారిగా ఓ మహిళ, అందులో ఆఫ్రో అమెరికన్ అయిన క్రిస్టినా కోచ్ చంద్రుడి పైకి వెళ్లనున్నారు. క్రిస్టినా కోచ్ ఇంజనీర్ గా ఈ మూన్ మిషన్ లో భాగం కాబోతున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఆర్టెమిస్ 2 జాబిలి వద్దకు వెళ్లనుంది. కెనడాకు చెందిన జెరెమీ హాన్సెస్ మిషన్ స్పెషలిస్టుగా, యూఎస్ నేవీ ఫైటర్ పైలెట్ రీడ్ వైస్ మాన్ కమాండర్ గా ఈ మిషన్ లో పనిచేయనున్నారు. ఆర్టెమిస్ I మిషన్ విజయవంతంగా డిసెంబర్ 2022లో పూర్తయింది. మానవ రహితంగా సాగిన ఈ యాత్ర తర్వాత ఆర్టెమిస్ 2 ద్వారా నలుగురు వ్యోమగాములను చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళ్లనున్నారు.

Read Also: IPL 2023: కేకేఆర్ కు షాకిచ్చిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. తప్పుకున్నా.. షకీబ్‌ తో పాటు మరో బ్యాటర్..!

చంద్రుడిపైకి వెళ్లి తిరిగి వచ్చేలా రూపొందించిన ఆర్టిమిస్-1 ప్రయోగాన్ని గతేడాది నాసా నిర్వహించి విజయం సాధించింది. నాసా రెండో ప్రయత్నంగా ఆర్టెమిస్-2 ద్వారా వ్యోమగాములను పంపనుంది. అయితే ఈ సారి చంద్రుడి ఉపరితలం చుట్టూ ఉన్న కక్ష్యలోకి వ్యోమగాములను పంపనుంది. మొత్తం నలుగురు వ్యోమగాముల్లో ముగ్గురు అమెరికాకు చెందని వారు కాగా.. ఒకరు కెనడా దేశస్తుడు. 50 ఏళ్ల క్రితం చివరిసారిగా అపోలో మిషన్ ద్వారా మానవుడు చంద్రుడిపైకి వెళ్లాడు.

ఆర్టెమిస్-2 మొత్తం 10 రోజుల మిషన్. 2024లో నలుగురు వ్యోమగాములను చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళ్లాలన్నది, తిరిగి భూమిపైకి సురక్షితంగా తీసుకురావాలన్నది నాసా ప్లాన్. ఇది విజయవంతం అయిన తర్వాత ఆర్టిమిస్ -3 ద్వారా వ్యోమగాములు చంద్రుడిపై ల్యాండ్ అయ్యే ప్రయోగానికి మార్గం సుగమం అవుతుంది.

Show comments