Naked PhotoShoot: అప్పుడే సూర్యుడు ఉదయించేందుకు సిద్ధమవుతున్నాడు. నెమ్మదిగా తెల్లారుతోంది. అదే సమయంలో ఆస్ట్రేలియా సిడ్నీలో ఉన్న బాండీ బీచ్ వద్ద 2,500 మంది నగ్నంగా నిలబడి ఉన్నారు. ఎందుకో అనుకోమాకండి. వాళ్లంతా ఫోటో షూట్‌లో పాల్గొన్నారు. అయితే వీరు మంచి కాజ్ కోసమే నగ్నంగా ఫోటోలకు పోజులిచ్చారు. వివరాల్లోకి వెళ్తే ఆస్ట్రేలియాలో స్కిన్ క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉన్నారు. తాజా నివేదిక ప్రకారం 70 సంవత్సరాల వయస్సులోపు ప్రతి ముగ్గురిలో ఇద్దరు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. చర్మ క్యాన్సర్‌పై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమెరికా ఫొటోగ్రాఫర్ స్పెన్సర్ టునిక్ ఈ ప్రాజెక్టు చేపట్టారు. దీంతో 2,500 మంది వ్యక్తులు తమ దుస్తులు విప్పి అతడికి సహకారం అందించారు.
Read Also: Australia Beach Case: కుక్కు చేసిన ఆ చిన్న తప్పే.. ఆ యువతి హత్యకు కారణం
కాగా ట్యూనిక్ ప్రపంచంలోని ప్రసిద్ధమైన ప్రాంతాల్లో సామూహిక నగ్న ఫోటో షూట్‌లను ప్రదర్శించడంలో ఎంతో పేరు పొందాడు. న్యూయార్క్‌కు చెందిన అతడు ఆస్ట్రేలియాలో నాల్గవ అత్యంత సాధారణమైన క్యాన్సర్ రూపమైన మెలనోమా గురించి అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా నేక్డ్ ఆర్ట్ ఇన్‌స్టాలేషన్‌పై స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేశాడు. ఈ సంవత్సరం ఆస్ట్రేలియాలో 17,756 కొత్త చర్మ క్యాన్సర్ కేసులు నిర్ధారణ అవుతాయని, 1,281 మంది ఆస్ట్రేలియన్లు ఈ వ్యాధితో చనిపోతారని ఫెడరల్ ప్రభుత్వం అంచనా వేసింది. 2010లో సిడ్నీలో 5,200 మంది ఆస్ట్రేలియన్లు సిడ్నీ ఒపెరా హౌస్‌లో నగ్నంగా పోజులిచ్చినప్పుడు టునిక్ చివరిసారిగా మాస్ షూట్‌కు దర్శకత్వం వహించాడు. మరోవైపు బీచ్‌ల్లో నగ్నంగా తిరిగేందుకు ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టం కూడా చేసింది.
Read Also: Team India: టీమిండియాకు మరో విరాట్ కోహ్లీ దొరికేశాడా?
