NTV Telugu Site icon

Naegleria Fowleri Infection: ‘మెదడును తినే అమీబా’.. అమెరికాలో ఒకరు మృతి.. ఈ వ్యాధి ఎలా సోకుతుంది.. లక్షణాలేంటి..?

Brain Eating Amoeba

Brain Eating Amoeba

Naegleria Fowleri Infection: ప్రపంచంలో కొత్తకొత్త వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. చైనా వూహాన్ నగరంలో ప్రారంభం అయిన కోవిడ్ 19 వ్యాధి గత రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. చాలా దేశాలు కోవిడ్ తో ఆర్థికమాంద్యం పరిస్థితుల్లోకి వెళ్లాయి. ఇక ఇప్పుడు మంకీపాక్స్ రూపంలో మరో వ్యాధి ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. ఇప్పటికే 92 దేశాల్లోకి ఈ వ్యాధి పాకింది. 35 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఎక్కువగా యూరప్ దేశాలు, అమెరికాలోనే ఎక్కువగా నమోదు అయ్యాయి.

తాజాగా మరో కొత్త వ్యాధి వెలుగులోకి వచ్చింది. అత్యంత అరుదుగా సంభవించే నేగ్లేరియా ఫౌలెరీ ఇన్ఫెక్షన్‌తో అమెరికాలోనే నెబ్రాస్కాలో ఓ చిన్నారి మరణించింది. అత్యంత అరుదైన వ్యాధిగా దీన్ని చూస్తారు. ఈ నేగ్లేరియా ఫౌలేరీ ఇన్ఫెక్షన్ ను ‘‘ మెదడు తినే అమీబా’’గా పిలుస్తారు. ఇది ముఖ్యంగా మెదడుపై ప్రభావం చూపిస్తుంది. ఈ వ్యాధి సోకితే దాదాపుగా ప్రాణాలు కోల్పేయే అవకాశం ఉంది.

Read Also: Chahal- Dhanashree: వేరే క్రికెటర్‌తో భార్యకు ఎఫైర్.. చాహల్ ఏమన్నాడంటే..?

వ్యాధి ఎలా సోకుతుంది..?

నెగ్లేరియా ఫౌలేరి అనేది సరస్సులు, నదులు, వేడి నీటి బుగ్గలు వంటి ప్రాంతాల్లో నేలలో, వెచ్చని మంచినీటిలో నివసించే అమీబా. ఈ అమీబీ ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటీస్ (పీఏఎం)కు కారణం అవుతుంది. దీనిని మెదడును తినే అమీబాగా వ్యవహరిస్తారు. సాధారణంగా ఈత కొట్టేటప్పుడు అమీబా ఉన్న నీరు ముక్కుపైకి వెళ్లినప్పుడు మెదడుకు ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఇది సోకితే దాదాపుగా మరణం సంభవిస్తుంది.

సురక్షితమై, క్లోరినేషన్ చేసిన నీటి కొలనుల్లో ఈత కొట్టడం వల్ల ఈ వ్యాధి బారిన పడే అవకాశం తగ్గతుంది. యూఎస్ఏలో ప్రతీ ఏడాది ముగ్గురు ఈ వ్యాధి బారినపడి మరణిస్తున్నారు. ఈ వ్యాధి సోకినప్పుడు ప్రారంభంలో తలనొప్పి, జ్వరం, వికారం, వాంతుల వంటి లక్షణాలు ఉంటాయి. నెమ్మదిగా వ్యాధి తీవ్రం అవుతుంది. చివరకు ప్రాణాంతకంగా మారుతుంది.

Show comments