NTV Telugu Site icon

China: చైనాలో ప్రబలుతున్న “మిస్టరీ వ్యాధి”.. కారణాలు ఇవే అంటున్న ఆ దేశ అధికారులు..

China 2

China 2

China: చైనాలో మిస్టరీ వ్యాధి విస్తరిస్తోంది. ముఖ్యంగా ఆ దేశంలోని పిల్లలు శ్వాసకోశ జబ్బుల బారిన పడుతున్నారు. అయితే అనేక వ్యాధికారకాలు దేశంలో తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయని చైనా ఆరోగ్య కమిషన్ తెలిపింది. ఈ వ్యాధులకు నోవల్ వైరస్ కారణంగా ఉండవచ్చని పేర్కొంది. ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కేసుల పెరుగుదలకు సంబంధించి ప్రధాన కారణాల్లో ఒకటని జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రతినిధి మి ఫెంగ్ ఆదివారం మీడియాతో చెప్పారు. రైనో వైరస్, మైకోప్లాస్మా న్యూమోనియా, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ కూడా వ్యాపిస్తుందని తెలిపారు. దేశంలో మందుల సరఫరా పెంచడంతో పాటు వైద్య చికిత్స కోసం మరిన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఫెంగ్ అన్నారు. కొత్త వైరస్ లేదని, సాధారణంగా శీతాకాలంలో వచ్చే శ్వాసకోశ సమస్యలే అని చైనా వెల్లడిస్తోంది.

Read Also: 26/11 Mumbai attacks: ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు, అణిచివేస్తాం.. ముంబై దాడులపై ప్రధాని మోడీ..

శ్వాసకోశ వ్యాధుల వ్యాప్తి ముఖ్యంగా పిల్లలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. వారి ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో తల్లిదండ్రులు పిల్లల్ని పట్టుకుని ఆస్పత్రుల ముందు పడిగాపులు పడుతున్నారు. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మరియు బీజింగ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ గురువారం ప్రపంచ ఆరోగ్య సంస్థతో మాట్లాడుతూ.. పెషెంట్ల సంఖ్య, ఆస్పత్రిలో చేరడం పెరుగుతోందని, వ్యాధి పెరగడానికి అన్ని రకాల సూక్ష్మక్రిములు కారణమవుతున్నాయని తెలిపారు. బీజింగ్, లియానింగ్, ఇతర ప్రాంతాల్లో పిల్లలు ఆస్పత్రుల్లో నమోదువుతున్న న్యుమోనియా కేసుల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) మరిన్ని వివరాలు కోరిన నేపథ్యంలో చైనా తాజా వ్యాఖ్యలు చేసింది.